Begin typing your search above and press return to search.
ఒక్క ట్వీటుతో మచ్చ తుడిచేస్తున్నారు
By: Tupaki Desk | 13 Nov 2015 3:30 PM GMTవస్తూ వస్తూ వెలుగులు తెచ్చే పండుగ దీపావళి. దీపాల వెలుగులే కాదు.. లైఫ్ లో కూడా లైటింగ్ ఇచ్చేస్తుందని జనాల నమ్మకం. అందుకే అంత గ్రాండ్ గా ఈ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటారు. పండుగ రోజున ఓ ట్వీట్ తో శ్రీను వైట్లతో ఉన్న విబేధాలను తుడిచేశాడు ఆయన భార్య రూప వైట్ల. ఇప్పుడు ఇలాంటి సంఘటనే ఒకటి బాలీవుడ్ లో కూడా జరిగింది.
రాక్ ఆన్2 మూవీ సెట్స్ పై ఉన్న అర్జున్ రాంపాల్.. తన భార్య మెహర్ - పిల్లల ఫోటోను పోస్ట్ చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. దివాలీ జరుపుకునేందుకు షిల్లాంగ్ లో నాతో జతయ్యారు. వాళ్లని ఇక్కడ చూస్తే ఫుల్లు హ్యాపీగా ఉందన్నది అర్జున్ ట్వీట్ సారాంశం. ఇలా భార్యాపిల్లలతో పండుగ చేసుకోవడం వింతేం కాదు కానీ.. కొన్ని రోజుల క్రితం జరిగిన ఓవివాదం కారణంగానే దీనికి ప్రాధాన్యత వచ్చింది. అర్జున్ రాంపాల్ కి హ్రితిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ తో అఫైర్ ఉందని.. వీళ్లిద్దరూ కలి లండన్ టూర్ కూడా వెళ్లొచ్చారని న్యూస్ హల్ చల్ చేశాయి. అఫ్ కోర్స్ వీటిని రూమర్స్ గా చెప్పిన సుసానే - అర్జున్ లు ఆ వార్తలను కొట్టిపారేశారు.
అయితే.. సుసానే కారణంగా మెహర్ తో అర్జున్ విడిపోనున్నాడని కూడా వార్తలొచ్చాయి. కొన్నాళ్లుగా విడిగా కూడా ఉంటున్నాడు. అయితే.. సడెన్ గా దీపావళి రోజున భర్త కు సర్ ప్రయిజ్ ఇచ్చింది మెహర్. పిల్లలతో కలిసి సరదాగా గడిపింది. శ్రద్ధా కపూర్ - ఫరాన్ అక్తర్ - ప్రాచీ దేశాయ్ లతో కలిసి రాక్ ఆన్2 సెట్స్ పై ఉన్న అర్జున్.. భార్యాపిల్లల పోటోలనే ట్వీట్ చేసి.. తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇలా ఒక ఫోటో ఒక ట్వీట్ తో తనపై ఉన్న మచ్చ తుడిచేసుకునే ప్రయత్నం చేశాడు.