Begin typing your search above and press return to search.
విజయవాడలో బొమ్మ పడింది
By: Tupaki Desk | 1 Nov 2020 4:00 PM GMTకేంద్రం ప్రభుత్వం థియేటర్లకు అన్ లాక్ చేసినప్పటికి చాలా థియేటర్లు ఇంకా ఓపెన్ కాలేదు. దేశ వ్యాప్తంగా సింగిల్ స్ర్కీన్ థియేటర్లు మరియు మల్టీప్లెక్స్ లు ఇప్పటి వరకు ప్రారంభం అవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేటర్ల ఓపెన్ పై ఒక క్లారిటీ లేకుండా ఉంది. ఎట్టకేలకు విజయవాడలో అన్ని మల్టీప్లెక్స్ లు ఓపెన్ అయ్యాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో అన్ని మల్టీ ప్లెక్స్‌లను రోజుకు మూడు షోల చొప్పున నడిపిస్తున్నారు. అయితే ఇప్పటికి రాష్ట్రంలోని 800 సింగిల్ స్ర్కీన్ థియేటర్లు ఓపెన్ ఎప్పుడు అనే విషయంపై క్లారిటీ లేదు.
ఎనిమిది నెలల తర్వాత విజయవాడలో బొమ్మ పడటంతో ప్రేక్షకులు మెల్ల మెల్లగా థియేటర్లకు క్యూ కడుతున్నారు. పాత సినిమాలు స్ర్కీనింగ్ చేస్తున్నారు. ఈ నెల రెండవ లేదా మూడవ వారంలో సినిమాలు విడుదల అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై ఇంకా స్పష్టత లేదు. అయినా కూడా మల్టీప్లెక్స్ లను ఓపెన్ చేశారు. థియేటర్లకు ఎప్పుడు ఓపెన్ చేసే విషయమై ఇంకా స్పష్టత లేదు. తెలంగాణలోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ లో కూడా మొదట మల్టీప్లెక్స్ లను ఓపెన్ చేసే విషయమై చర్చలు జరుగుతున్నాయి.