Begin typing your search above and press return to search.
ప్రయోగానికి హీరో, హీరోయిన్ రెడీ
By: Tupaki Desk | 19 Jan 2019 6:33 AM GMTగత ఏడాది తమిళంలో తెరకెక్కి సూపర్ డూపర్ హిట్ దక్కించుకున్న చిత్రం '96'. విజయ్ సేతుపతి, త్రిష కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం తమిళనాట క్లాసిక్ గా నిలిచిపోయింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని దిల్ రాజు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ సినిమాపై తెలుగు స్టార్స్ పలువురు ప్రశంసలైతే కురిపించారు కాని ఆ రీమేక్ లో నటించేందుకు మాత్రం ముందుకు రాలేదు. పలువురు హీరోలకు ఈ చిత్రాన్ని చూపించిన దిల్ రాజుకు నిరాశే మిగిలింది. చివరగా ఈ ప్రయోగాత్మక రీమేక్ లో శర్వానంద్ హీరోగా నటించేందుకు ఒప్పుకున్నాడు.
శర్వా గతంలో మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రంలో కాస్త ఏజ్డ్ పాత్రలో కనిపించాడు. అందులో ఆకట్టుకున్న శర్వానంద్ తప్పకుండా ఈ చిత్రంలో కూడా మెప్పిస్తాడని అంతా భావిస్తున్నారు. ఇక త్రిష పోషించిన పాత్రను ఎవరైతే బాగా చేస్తారని చర్చించుకుంటున్న సమయంలో దిల్ రాజు ఈ రీమేక్ కోసం సమంతను ఒప్పించాడు. తెలుగులో ఈ చిత్రం రీమేక్ చేయడం మంచి నిర్ణయం కాదన్నట్లుగా సమంత అభిప్రాయ పడింది. కాని దిల్ రాజు ఆమెను కన్విన్స్ చేసినట్లుగా తెలుస్తోంది.
'96' చిత్రం కథ చాలా విభిన్నంగా ఉంటుంది. అలాంటి కథలు తెలుగులో ఆడటం కష్టమే. అప్పట్లో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమా తమిళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకుని, తెలుగులో ఎలా అయితే పోయిందో ఇది కూడా అదే పరిస్థితి అవుతుందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా ఒక మంచి సినిమా తీశాననే పేరు రావాలని ఈ ప్రయోగాన్ని దిల్ రాజు మొదలు పెట్టాడు. ఈ ప్రయోగానికి శర్వా, సమంతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'ఎఫ్2' ఇచ్చిన సక్సెస్ జోష్ లో ఉన్న దిల్ రాజు ఈ రీమేక్ పనులు స్పీడప్ చేసే అవకాశం ఉంది. ఇదే ఏడాదిలో తెలుగు '96' ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.