Begin typing your search above and press return to search.
మహేష్ కు మెగా 152 స్టోరీ చెప్పిన కొరటాల!
By: Tupaki Desk | 24 Feb 2020 6:15 AM GMTమెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం గురించి రోజుకో వార్త పుట్టుకు వస్తుంది. ఈ నేపథ్యంలో అసలు నిజాలు ఏంటీ.. పుకార్లు ఏంటో తేల్చుకోలేక జనాలు జుట్టు పీక్కునే పరిస్థితి. గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు మెగా 152 మూవీలో నటించేందుకు ఒప్పుకున్నాడు. నెల రోజులు డేట్లు ఇచ్చి చిరు సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలను చాలా మంది లైట్ తీసుకున్నారు. చిరు మూవీలో మహేష్ ఏంటీ అనుకుని ఖచ్చితంగా పుకారే అనుకున్నారు.
చిరు మూవీలో మహేష్ నటించబోతున్నాడు అనేది పుకారు కాదు నిజమే అంటూ ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఎందుకంటే ఇటీవలే మహేష్ ను కలిసిన దర్శకుడు కొరటాల శివ మెగా 152 చిత్రానికి సంబంధించిన కథను నరేట్ చేయడంతో పాటు తాను చేయాల్సిన పాత్ర తాలూకు ప్రాముఖ్యతను తెలియజేసినట్లుగా సమాచారం. మెగాస్టార్ చిరంజీవితో మహేష్ బాబుకు మొదటి నుండి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
ప్రస్తుతానికి తానేం సినిమాను మొదలు పెట్టలేదు.. అలాగే భారీ పారితోషికం ఆఫర్ చేయడంతో మహేష్ కాదనలేక పోతున్నాడట. వారం రోజులు టైం అడిగిన మహేష్ బాబు దాదాపుగా ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ మహేష్ బాబుకు సన్నిహితంగా ఉండే ఒక పీఆర్ చెప్పుకొచ్చాడు. ఆయన చెబుతున్నదాని ప్రకారం ఏప్రిల్ లో మహేష్ బాబు మెగా 152 సినిమా షూట్ కు హాజరు అవుతాడట.
చిరంజీవి.. మహేష్ ల కాంబో సీన్స్ ఉండవట. సినిమా బజ్ పెంచడంతో పాటు భారీ బిజినెస్ ను చేసేందుకు కొరటాల శివ ఈ ప్రయత్నం చేశాడు. కొరటాల శ్రీమంతుడు.. భరత్ అనే నేను చిత్రాలతో మహేష్ కు సూపర్ హిట్స్ ఇచ్చాడు. అందుకే కొరటాల రిక్వెస్ట్ ను మహేష్ బాబు కాదనకపోవచ్చు అనేది కొందరి వాదన.