Begin typing your search above and press return to search.

చరణ్ - శంకర్ మూవీకి క్లాప్‌ కొట్టబోయేది ఎవరంటే!

By:  Tupaki Desk   |   4 Sep 2021 5:30 AM GMT
చరణ్ - శంకర్ మూవీకి క్లాప్‌ కొట్టబోయేది ఎవరంటే!
X
ఆర్ ఆర్ ఆర్ ను ముగించిన రామ్‌ చరణ్‌ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమాకు రెడీ అవుతున్నాడు. దిల్‌ రాజు నిర్మాణంలో తెరకెక్కబోతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ కోసం గత కొన్ని నెలలుగా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుతున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కు వేళ్ల అయ్యింది. టాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంను ఈనెల 8న భారీగా నిర్వహించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారట. టాలీవుడ్ ప్రముఖులతో పాటు బాలీవుడ్ నుండి ఈ ప్రారంభోత్సవంకు గాను రణ్వీర్ కపూర్ ను దించబోతున్నట్లుగా తెలుస్తోంది.

రామ్ చరణ్ తో సినిమా తర్వాత శంకర్‌ బాలీవుడ్‌ లో అపరిచితుడు సినిమాను చేయబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాను రణ్వీర్ కపూర్ తో శంకర్ చేయబోతున్నాడు. అందుకే చరణ్‌ మూవీ ప్రారంభోత్సవం కోసం ఆయన్ను ఆహ్వానించారనే వార్తలు వస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం సినిమా కోసం సెట్స్ నిర్మాణం చేస్తున్నారు. శంకర్‌ మార్క్ సెట్టింగ్‌ లు మేకింగ్ ను ఈ సినిమాలో చూడబోతున్నాం. అయితే తక్కువ సమయంలో ఈ సినిమాను పూర్తి చేసేలా దిల్‌ రాజుతో శంకర్ ఒప్పందం చేసుకున్నారు అనేది సమాచారం.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్‌ చరణ్‌ తో శంకర్ చేయబోతున్న సినిమా లో మంచి మెసేజ్ తో పాటు ఆకట్టుకునే కమర్షియల్‌ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని అంటున్నారు. మొత్తానికి రామ్‌ చరణ్‌ మరియు శంకర్‌ ల కాంబోలో రూపొందుతున్న సినిమా భారీ పాన్‌ ఇండియా మూవీగా ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. శంకర్‌ మూవీ అంటే ఇండియా వ్యాప్తంగా విపరీతమైన బజ్ ఉంటుంది. ఆర్ ఆర్‌ ఆర్‌ తో పాన్‌ ఇండియా హీరోగా రామ్‌ చరణ్‌ గుర్తింపు దక్కించుకోవడం ఖాయం. పాన్ ఇండియా డైరెక్టర్‌ పాన్ ఇండియా హీరో ల కాంబోలో రూపొందుతున్న సినిమా అవ్వడం వల్ల అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంటాయి. దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న 50వ సినిమా అవ్వడం వల్ల చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నారు.