Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: ఆ క్రెడిట్ అంతా కాస్ట్యూమ్ డిజైన‌ర్ల‌దే!

By:  Tupaki Desk   |   23 March 2021 5:30 PM GMT
ట్రెండీ టాక్‌: ఆ క్రెడిట్ అంతా కాస్ట్యూమ్ డిజైన‌ర్ల‌దే!
X
ఎంచుకునే క‌థ‌ను కాలాన్ని బ‌ట్టే న‌టీన‌టుల‌..నాయిక‌ల లుక్కు వేష‌ధార‌ణ ఉండాలి. పురాణేతిహాసాల నుంచి క‌థ‌ల్ని ఎంపిక చేసుకున్నా.. పీరియ‌డ్ డ్రామాల్ని ఎంపిక చేసుకున్నా దానికి త‌గ్గ‌ట్టు వేషం మార్చాలి. నాటి వాతావ‌ర‌ణాన్ని కూడా సెట్లో తెర‌పైకి తేవాలి. అందుకోసం మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు చాలా ప‌రిశోధ‌న‌లే చేస్తుంటారు. సెట్స్ కాస్ట్యూమ్ డైరెక్ట‌ర్ల‌తో క‌లిసి చాలా శోధించాకే ఇవ‌న్నీ తెర‌పైకొస్తుంటాయి.

ఇంత‌కుముందు బాహుబలిలో దేవ‌సేన లుక్ కోసం అనుష్క‌పై బోలెడ‌న్ని ప్ర‌యోగాలు చేశారు రాజ‌మౌళి. నాటి రాణీ విలాసంలో ప‌డ‌తులు ఎలా ఉండేవారో బోలెడంత ప‌రిశోధించి ఒక రూపాన్ని తెచ్చారు. అనుష్క అందాల రాకుమారిగా ఉంటే ఎలా ఉండాలి? బంధిఖానాలో ఏళ్ల కొద్దీ మ‌గ్గి పోయాక ఎలా క‌నిపించాలి? అన్న‌ది ప‌రిశోధించి ఆ లుక్ ల‌ను డిజైన్ చేశారు. దేవ‌సేన రూపంపై చాలా కాలం డిస్క‌ష‌న్ న‌డిచింది.

ఇక ఇటీవ‌లి కాలంలో పాన్ ఇండియా సినిమా ఆర్.ఆర్.ఆర్ లో సీత‌గా ఆలియా లుక్ అంతే చ‌ర్చ‌కొచ్చింది. ఎంతో ఒద్దిక‌గా.. సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా చీర‌క‌ట్టు.. బుట్ట చేతుల జాకెట్ తో ఫ‌స్ట్ లుక్ ని చూపించిన తీరు మంత్ర‌ముగ్ధం చేసింది. ఈ పాత్ర‌ను తీర్చిదిద్దేందుకు కూడా జ‌క్క‌న్న కాస్ట్యూమ‌ర్ల‌తో క‌లిసి చాలానే ప‌రిశోధించార‌ట‌.

అలాగే గుణ‌శేఖ‌ర్ శాకుంత‌లం లో స‌మంత శ‌కుంత‌ల‌గా క‌నిపించే తీరు కూడా ఇప్ప‌టికే అభిమానుల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పురాణేతిహాసాల‌కు భారీ కాస్ట్యూమ్స్ సెట్స్ తో ప్ర‌యోగాలు గుణ‌శేఖ‌ర్ కి కొత్తేమీ కాదు కాబ‌ట్టి శ‌కుంత‌ల పాత్ర‌ను న‌భూతోన‌భ‌విష్య‌తి అన్న తీరుగా తీర్చిదిద్దుతారనే అంచ‌నా వేస్తున్నారు.

నాటి రోజుల్లో ఆకుప‌చ్చ‌.. ఎరుపు రంగు చీర‌లు లంగా ఓణీలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచేవి అన్నంత‌గా భ్ర‌మింప‌జేసే డిజైన్ల‌ను కాస్ట్యూమ‌ర్లు అందిస్తున్నారు. నేటి సినిమాల్లో చారిత్ర‌క అంశాల్ని మేళ‌విస్తూ రూపొందిస్తున్న డిజైన్స్ గొప్ప‌గా అబ్బుర పరుస్తున్నాయి.

మ‌రోవైపు బాలీవుడ్ లో గంగూభాయి క‌తియావాడీ అనే పీరియ‌డ్ సినిమాని తీస్తూ క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు భ‌న్సాలీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ఈ సినిమాలో ఆలియాను స‌రికొత్త‌గా ఆవిష్క‌రిస్తున్నారు. ఇంత‌కుముందు రిలీజ్ చేసిన ఆలియా లుక్ కూడా అంతే స‌ర్ ప్రైజ్ చేసింది. నాటి వాతావ‌రణంలో వేశ్యా గృహ నిర్వాహ‌కురాలు గంగూభాయిగా ఆలియా స్ట‌న్న‌యిపోయే ట్రీటిచ్చింది. ఆర్.ఆర్.ఆర్ లో సీత‌కు.. గంగూభాయికి ఉన్న డిఫ‌రెన్స్ కూడా ఇంప్రెస్సివ్ అన్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. వీట‌న్నిటి కోసం చాలా ప‌రిశోధ‌న అవ‌స‌రం. నాటి కాలానికి త‌గ్గ డిజైన‌ర్ లుక్ తేవ‌డం కోసం డిజైన‌ర్లు ద‌ర్శ‌కుల సూచ‌న‌ల మేర‌కు చాలానే శ్ర‌మించాల్సి ఉంటుంది.