Begin typing your search above and press return to search.
ప్రభాస్ పై ఒక్క సీన్ కోసం అన్ని కోట్లా?
By: Tupaki Desk | 12 Feb 2022 12:30 AM GMT`బాహుబలి`తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ తాజా చిత్రంతో అంతకు మించి రేంజ్ కి వెళ్లబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. `రాధేశ్యామ్` తరువాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లని లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో తొలిసారి చేస్తున్న మైథలాజికల్ మూవీ `ఆది పురుష్` సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతీ అప్ డేట్ సినీ లవర్స్ తో పాటు భారతీయ సినీ మేకర్ లని ఆశ్చర్యపరుస్తోంది.
రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నారు. సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. గ్రాఫిక్స్ కి అత్యంత ప్రాధాన్యత వున్న ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఓమ్ రౌత్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రభాస్ శ్రీరాముని గెటప్ అత్యంత హైలైట్ గా నిలవనున్న ఈ మూవీ కి సంబంధించిన అత్యంత షాకింగ్ న్యూస్ ఒకటి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతోంది.
సినిమాలోని ఓ కీలక సన్నివేశంలో వచ్చే సీన్ కు సంబంధించిన ఆశ్చర్యకరమైన వార్త ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతూ పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభించిన దగ్గరి నుంచి చర్చనీయాంశంగా మారిన ఈ మూవీ మరో సారి వార్తల్లో నిలుస్తోంది. భారతీయ చిత్రాల్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాగా ఇప్పటికే రికార్డు సాధించిన ఈ చిత్రాన్ని దాదాపు 500 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ సీన్ కోసం ఊహించని మొత్తాన్ని మేకర్స్ ఖర్చు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది సినిమాకు సంబంధించి వన్ ఆఫ్ ది హైలైట్ లలో ఒకటిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే ఈ చిత్రంలోని కీలకమైన ఓ పాస్ట్ సీన్ కోసం మేకర్స్ ఏకంగా 60 కోట్లు ఖర్చు చేశారట. ప్రస్తుతం ఇది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఒక్క సీన్ కోసమే ఇన్ని కోట్లు ఖర్చు చేశారంటే సినిమాని ఏ రేంజ్ లో తీర్చి దిద్దుతున్నారో అర్థమవుతోందని భారతీయ సినీ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
అంతే కాకుండా ఈ మూవీకి `అవతార్` కోసం ఉపయోగించి టెక్నాలజీని వినియోగిస్తున్నారు. సీజీఐ, వీఎఫ్ ఎక్స్ వర్క్ కు భారీ స్పాన్ వున్న మూవీ కావడంతో ఇందు కోసం ఎక్కువ సమయం పడుతుందని, అందు కోసం ముందుగానే షూటింగ్ పూర్తి చేసిన దర్శకుడు ప్రస్తుతం ఆ పనిలో బిజీగా వున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే క్లైమాక్స్ చిత్రీకరణకు సంబంధించిన సన్నివేశాల వీఎఫ్ ఎక్స్ వర్క్ కోసం వివిధ దేశాలకు చెందిన దాదాపు 50కి పైగా టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
దీన్ని బట్టే `ఆది పురుష్` ఏ స్థాయిలో తెరపై ఆవిష్కృతం కానుందన్నది స్పష్టమవుతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.