Begin typing your search above and press return to search.

సారంగ దరియా పూర్తి విజువ‌ల్ సాంగ్ ప‌దింత‌లు బెట‌ర్ ట్రీటిస్తుంద‌ట‌..!

By:  Tupaki Desk   |   3 April 2021 10:34 AM GMT
సారంగ దరియా పూర్తి విజువ‌ల్ సాంగ్ ప‌దింత‌లు బెట‌ర్ ట్రీటిస్తుంద‌ట‌..!
X
నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా న‌టిస్తున్న‌ `లవ్ స్టోరీ`లోని తెలంగాణ జానపద పాట సారంగ దరియా ఒక నెలలోనే 100 మిలియన్ల(10కోట్ల‌)కు పైగా యూట్యూబ్ వీక్షణలను సాధించ‌డం ద్వారా 2021 బెస్ట్ చార్ట్ ‌బస్టర్ ‌గా నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చాలా సంవత్సరాల క్రితం బుల్లితెరపై పాపుల‌రైన ఈ పాట ఇప్పుడు వెండితెర రీమిక్స్ గా అంత‌కుమించి ఆద‌ర‌ణ పొంద‌డం ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఇది క‌మ్ముల ఎంపిక‌.

లవ్ స్టోరీలోని ఒక సీక్వెన్స్ సారంగ దరియా పాటను ఎంచుకోవ‌నికి కార‌ణ‌మైంద‌ని.. ఆ పాట థీమ్ క‌థ‌లో భాగ‌మ‌ని శేఖర్ క‌మ్ముల‌ ఇటీవల వెల్ల‌డించారు. అందుకే అతను కంటెంట్ కి తగినట్లుగా సాహిత్యాన్ని కొద్దిగా మార్చాల్సిందిగా ప్రముఖ గీత రచయిత సుద్ధాల అశోక్ తేజతో చ‌ర్చించార‌ట‌. కొత్త బాణీకి త‌గ్గ‌ట్టే సాహిత్యం కుదిరింది. సుద్ధాల లిరిక్ ఆక‌ట్టుకుంది.

ఈ పాట‌ను మంగ్లీ ఆల‌పించ‌డం మ‌రో పెద్ద అస్సెట్ అని చెప్పాలి. మంగ్లీ గానం.. సాయి పల్లవి నృత్యం పీక్స్ కి తీసుకెళ్లాయి. అలాగే కొరియోగ్రాఫర్ ప‌నిత‌నం మైమ‌రిపించింది. పూర్తి పాట వీడియో లిరికల్ వీడియో కంటే 10 రెట్లు అద‌నంగా ఆద‌ర‌ణ పొందుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను`` అని శేఖర్ క‌మ్ముల‌ అన్నారు. లవ్ స్టోరీ ఏప్రిల్ 16 న విడుదలవుతోంది.