Begin typing your search above and press return to search.
టాలీవుడ్ ఆశలన్నీ 'రామారావు' పైనేనా?
By: Tupaki Desk | 27 July 2022 5:30 PM GMTమాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం `రామారావు ఆన్ డ్యూటీ `. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ & రవితేజ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహించాడు. రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా చేశారు. సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఇందులో ఓ కీలక పాత్రను పోషించాడు. కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు.
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం జూలై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. ఇందులో రవితేజ డిప్యూటీ కలెక్టర్ గా కనిపించనున్నాడు. టీజర్, ట్రైలర్, పాటలు సినిమా పై మంచి హైప్ ఏర్పడేలా చేశాయి. మరింత బజ్ క్రియేట్ చేసేందుకు చిత్ర టీమ్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఇకపోతే ఈ సినిమాపై టాలీవుడ్ ఎన్నో ఆశలు పెట్టుకుందట. అందుకు కారణం లేకపోలేదు. 2022 ప్రారంభం అయ్యాక జనవరి నుంచి జూన్ వరకు ప్రతి నెల ఒక హిట్ మూవీ అయినా టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కానీ, జూలై నెలలో ఒక్కటంటే ఒక్క హిట్ మూవీ కూడా పడలేదు. చిన్న సినిమాల విషయం పక్కన పెడితే.. ఈ నెల 1వ తేదీన టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్-మారుతి కాంబినేషన్ లో తెరకెక్కిన `పక్కా కమర్షియల్` విడుదలైంది.
జూలై 14న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా నటించిన `ది వారియర్` రాగా.. జూలై 15న సాయి పల్లవి నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ `గార్గి` దిగింది. ఇక జూలై 22న యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ `థ్యాంక్యూ` రిలీజ్ అయింది. ఈ నాలుగు చిత్రాల ఫలితాల గురించి అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి.
దీంతో ఈ నెల ఆఖరిలో వస్తోన్న `రామారావు`పైనే టాలీవుడ్ ఆశలన్నీ పెట్టుకుందట. మరి ఈ సినిమా అయినా హిట్ టాక్ సొంతం చేసుకుని జూలై నెల పరువు నిలబెడుతుందా..? లేక ఫ్లాప్ టాక్ తో టాలీవుడ్ ఆశలను ఆవిరి చేస్తుందా..? అన్నది చూడాలి.
కాగా, చాలాకాలం తర్వాత రవితేజ నుండి మాస్, క్లాస్ అంశాలతో కంటెంట్ ప్రధానంగా వస్తోన్న సినిమా ఇది. ఇందులో నాజర్, తనికెళ్ల భరణి, పవిత్రాల ఓకేశ్ కీలక పాత్రలను పోషించారు. సామ్ సి ఎస్ సంగీతం అందించారు.