Begin typing your search above and press return to search.
'ధమాకా' కి అన్నీ కలిసి వచ్చే అంశాలే
By: Tupaki Desk | 16 Dec 2022 5:18 AM GMTరవితేజ హీరోగా శ్రీలీలా హీరోయిన్ గా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ధమాకా సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. క్రిస్మస్ కానుకగా ఈనెల 23వ తారీకు అంటే వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ధమాకా సినిమా యొక్క సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
మొదటి నుండి కూడా ధమాకా సినిమా యొక్క రన్ టైమ్ తక్కువగా ఉంటుందని.. ఈ మధ్య కాలంలో రన్ టైమ్ తక్కువ ఉన్న సినిమాలకు మంచి టాక్ వస్తుంది కనుక అదే ఫార్ములాను ధమాకా మేకర్స్ కూడా ఫాలో అవుతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. అన్నట్లుగానే ధమాకా సినిమా యొక్క రన్ టైమ్ చాలా తక్కువగా ఉంది.
ధమాకా సెన్సార్ రన్ టైమ్ 138 నిమిషాలు( 2 గంటల 18 నిమిషాలు) గా కన్ఫర్మ్ అయ్యింది. పెద్ద హీరోల సినిమాలు మినిమంగా రెండున్నర గంటల నిడివి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కు దాదాపుగా పావు గంట తక్కువ నిడివి ఉండటం వల్ల కలిసి వస్తుందని అంటున్నారు. క్రిస్పీ స్క్రీన్ ప్లే మరియు సన్నివేశాల వల్ల ప్రేక్షకులకు బోర్ ఫీల్ ఉండదు.
ఎడిటింగ్ లో సాగతీత సన్నివేశాలు దాదాపుగా తీసేసినట్లుగానే అనిపిస్తుంది. అంతే కాకుండా యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎంటర్ టైన్మెంట్ సన్నివేశాలు కూడా సినిమాకు హైలైట్ గా నిలుస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా లో రవితేజ పూర్వపు లుక్ లో అభిమానులను అలరించబోతున్నాడు అని పోస్టర్స్ మరియు టీజర్స్ ను చూస్తూ ఉంటే అర్థం అవుతుంది.
గతంలో ఎప్పుడు లేని విధంగా ధమాకా సినిమా కోసం రవితేజ దాదాపు రెండు వారాల ముందు నుండే ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన ఇంతగా ఒక సినిమా కోసం మీడియా ముందుకు రావడం ఇదే అని ఆయన అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు.
మొత్తానికి అన్ని విషయాలు కూడా ధమాకా కు కలిసి వస్తున్నాయి. కనుక ధమాకా హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.