Begin typing your search above and press return to search.

నెట్టింట వైరల్ అవుతున్న 'ఆల్ టైం క్లాసిక్' జానపద చిత్రం!!

By:  Tupaki Desk   |   27 Dec 2020 2:35 PM GMT
నెట్టింట వైరల్ అవుతున్న ఆల్ టైం క్లాసిక్ జానపద చిత్రం!!
X
తెలుగు చిత్రసీమలో అన్నగారు సీనియర్ ఎన్టీఆర్ చేసిన ప్రయోగాలు, అన్ని రకాల సినిమాలు ఎవరు చేయలేరు. ఇప్పటి వరకు ఆయన తర్వాత చాలా తరాలు వచ్చి వెళ్లాయి. కానీ ఏ కథనాయకుడు అన్ని సినిమాలు, సాహసాలు చేయలేదని చెప్పాలి. ఎన్టీఆర్ అంటేనే తెలుగు ఇంటివాడిగా బంధం ఏర్పరచుకున్నది ఆయన ఒక్కరే. జానపదం, ఫాంటసీ, రొమాంటిక్, కామెడీ, పౌరాణికం, థ్రిల్లర్ ఇలా ప్రతి జానర్ లో చెరగని ముద్ర వేసిపోయారు. ఎన్నో గొప్ప క్లాసిక్ సినిమాలను మనకు అందించారు. అందులో ఒకటి 'పాతాళ భైరవి'. 1951లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన సినిమా ఇది. ఎన్నో అద్భుత అనుభూతులను కలిగిస్తుంది. జానపద నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ఓ కళాఖండం అని చెప్పవచ్చు.

ఎందుకంటే కాశి మజిలీ కథలు అనే ఫేమస్ నవల ఆధారంగా మేకర్స్ ఈ సినిమాను రూపొందించారు. ది గ్రేట్ కేవీ రెడ్డి దర్శకత్వంలో బి. నాగిరెడ్డి ఈ జానపద చిత్రాన్ని నిర్మించారు. ఇక ఎన్టీఆర్ తో పాటు ది గ్రేట్ ఎస్వి రంగారావు మాంత్రికుడిగా నటించారు. సుమారు మూడు గంటల పైగా నిడివి కలిగిన ఈ సినిమాను ఆద్యంతం ఆకట్టుకునేలా స్క్రీన్ ప్లే, సంభాషణలు, పాటలతో నడిపించారు. మాలతీ, రేలంగి, గిరిజ లాంటి గొప్ప నటులంతా ఇందులో ఉన్నారు. తాజాగా ఈ సినిమా పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సినీ చరిత్రలో అద్భుత సినిమాగా నిలిచిన ఈ సినిమా అప్పట్లోనే ఇరవై ఎనిమిది కేంద్రాలలో శత దినోత్సవ వేడుకలు జరుపుకుందట. అల్లాద్దీన్ అద్భుత దీపం, బాలనాగమ్మ లాంటి ఎపిసోడ్లు ఎప్పటికి మరువలేనివి. సోషల్ మీడియా వేదికగా మరోసారి పాతాళ భైరవి మూవీని సినీప్రియులు తలచుకుంటున్నారు.