Begin typing your search above and press return to search.
9 నెలల పసికందుపై దారుణం.. సినిమాగా!!
By: Tupaki Desk | 24 Jun 2019 4:48 AM GMTసినిమా సమాజాన్ని ప్రభావితం చేయాలి. కానీ నేడు సమాజమే సినిమాని ప్రభావితం చేస్తోంది. సమాజాన్ని చూస్తే చాలు సులువుగా సినిమా తీసేయొచ్చు! అంటున్నారు సీనియర్ దర్శకనిర్మాత అల్లాణి శ్రీధర్. కొమరం భీమ్.. చిలుకూరు బాలాజీ లాంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు పొందిన ఆయన ప్రయోగాత్మకంగా పలు సామాజిక చిత్రాల్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నేటి సమాజంలో దారుణాలనే ఇతివృత్తాలుగా ఎంచుకుని సినిమాలు తీసేందుకు రెడీ అవుతున్నారు. 9 నెలల పసికందు నుంచి 90ఏళ్ల వృద్ధ మహిళల వరకూ ఎందుకు లైంగిక దాడులు జరుగుతున్నాయి? అనే కాన్సెప్టుతో సినిమా తీయనున్నామని ఆయన ప్రకటించారు. అందుకు సంబంధించిన కథపై ఆసక్తికరంగా ఓ టీనేజీ అమ్మాయి పరిశోధన చేశారని .. నిజ ఘటన ఆధారంగా ఈ సినిమా చేస్తున్నానని వెల్లడించారు. నేటి తరం డిజిటల్ మాధ్యమాలకు ఎలా బానిసలవుతున్నారనే కథాంశంతో `డూడు.. డీడీ` అనే చిన్నపిల్లల సినిమా తీశాను. హైదరాబాద్ అంతర్జాతీయ సినిమా ఉత్సవాలు.. కలకత్తా చిల్డ్రన్ ఫెస్టివల్‌లో ఇది ప్రదర్శితమైంది. త్వరలో విడుదల చేస్తాం...`` అని తెలిపారు. అలాగే స్వీయ దర్శకత్వంలో తెరకెక్కి విజయం సాధించిన కొమరం భీమ్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తామన్నారు. నేటి ట్రెండ్ కు తగ్గట్టు డిజిటలైజ్ చేసి తెలుగులోనూ మళ్లీ రిలీజ్ చేస్తామని తెలిపారు.
అలాగే థ్రిల్లర్ జోనర్‌లో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నామని అల్లాణి వెల్లడించారు. సామాజిక సందేశంతో తెరకెక్కించే సినిమాలకు ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించాలని అన్నారు. అలాగే ఓ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. బిచ్చగాడు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆ సినిమాని నిర్మిస్తున్నారని వెల్లడించారు. నేడు అల్లాణి పుట్టినరోజు సందర్భంగా మీడియాకి వెల్లడించిన సంగతులివి.