Begin typing your search above and press return to search.
అల్లరోడి 50వ సినిమా... త్వరలో!
By: Tupaki Desk | 20 Feb 2016 9:30 AM GMTఅదెలా?... అల్లరి నరేష్ హాఫ్ సెంచరీ మైలురాయిని ఎప్పుడో దాటేశాడు కదా! మళ్లీ ఇప్పుడు యాభైయ్యవ సినిమా అంటారేంటి? అనేదేనా మీ సందేహం. మీరు అలా సందేహించడంలో న్యాయముంది. నిజంగానే అల్లరి నరేష్ యాభయ్యవ సినిమాగా `మామ మంచు అల్డుడు కంచు` చేశాడు. కానీ మైలురాయిలాంటి ఆ చిత్రం నరేష్ కి పెద్ద షాక్ నే ఇచ్చింది. అలా వచ్చి ఇలా వెళ్లిపోయిందా సినిమా. నరేష్ ఇలాంటి సినిమాని ఎలా ఒప్పుకొన్నాడ్రా బాబోయ్ అన్నారు ప్రేక్షకులు.
అయితే నరేష్ మాత్రం మోహన్ బాబుతో కలిసి నటించే అవకాశాన్ని ఎందుకు కాలదన్నుకోవాలి అని ఆ సినిమాని చేసేశాడు. అయితే నరేష్ మొదట్నుంచీ తన యాభయ్యవ సినిమా ప్రత్యేకంగా ఉండాలంటూ వచ్చాడు. అందుకోసం ఇద్దరు ముగ్గురు దర్శకులతో మాట్లాడి కథలు కూడా సిద్ధం చేయించుకున్నాడు. అందులో జి.నాగేశ్వరరెడ్డి కథ కూడా ఉంది. తన సొంత సంస్థలోనే ఆ సినిమా చేయాలనుకొన్నాడు నరేష్. అయితే ఇంతలో రకరకాల పరిణామాలు చోటు చేసుకొన్నాయి. అంతకుముందే నరేష్ తన సొంత బ్యానర్ లో చేసిన బందిపోటు ఫ్లాప్ కావడం, అదే సమయంలో తాను నటించిన ఇతరత్రా సినిమాలు కూడా బాక్సాఫీసుపై పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఇక గత్యంతరం లేక తన యాభయ్యవ సినిమాని మోహన్ బాబుతో కలిసి చేసేశాడు. కానీ ఆ చిత్రం ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే అప్పట్లో తన యాభయ్యవ సినిమా కోసమని సిద్ధం చేయించిన కథలో ఇప్పుడు నటించేందుకు రంగం సిద్ధం చేసుకొన్నాడు నరేష్. తనని ఫ్లాప్ ల నుంచి గట్టెక్కించే దమ్ము ఆ కథకే ఉందనేది నరేష్ నమ్మకం. అందుకే బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించనున్న ఆ చిత్రంపై నరేష్ ప్రత్యేకమైన ఆసక్తి కనబరుస్తున్నాడు. జి.నాగేశ్వరరెడ్డి ఇదివరకు బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ బ్యానర్ లో ఒక సినిమా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకొన్నాడు. ఆ మేరకే ఇప్పుడు నరేష్ తో సినిమా పట్టాలెక్కబోతోంది.