Begin typing your search above and press return to search.

కామెడీ మల్టి స్టారర్ రెడీ అవుతోంది

By:  Tupaki Desk   |   27 Dec 2017 1:14 PM GMT
కామెడీ మల్టి స్టారర్ రెడీ అవుతోంది
X
రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో కరెక్ట్ గా చెప్పలేము గాని కరెక్ట్ కంటెంట్ తో కామెడీ సినిమా వస్తే తప్పకుండా చూడటానికి థియేటర్స్ వరకు వెళతారు. ప్రస్తుతం కామెడీ చేసి నవ్వించే హీరోలు టాలీవుడ్ లో చాలామందే ఉన్నారు. ముఖ్యంగా అల్లరి నరేష్ ఎక్కువగా కామెడీ సినిమాలను చేస్తాడు అని అందరికి తెలిసిందే. ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నరేష్ ఈ మధ్య హిట్స్ పెద్దగా అందుకోవడం లేదు.

ఇక అదే తరహాలో సునీల్ కూడా కొంచెం అపజయాలను ఎదుర్కొంటున్నాడు. అయితే ఈ కామెడీ హీరోలు కలిసి హిట్ కొట్టాలని ఈ సారి చేతులు కలపడానికి రెడీ అయ్యారట. త్వరలో ఇద్దరు కలిసి తెరపై డబుల్ కామెడీని అందిస్తారట. తమిళ్ రీమేక్ సుడిగాడు సినిమాతో అల్లరి నరేష్ కి బాక్స్ ఆఫీస్ హిట్ ఇచ్చిన భీమనేని శ్రీనివాస్ ఈ కామెడీ మల్టి స్టారర్ ని తెరకెక్కించబోతున్నాడు. అయితే ఇప్పుడు తమిళ్ లోని సుడిగాడు కథకి సినిమాకి సీక్వెల్ రూపొందుతోంది.

దీంతో దర్శకుడు ఆ సినిమా విడుదల కాకముందే రీమేక్ హక్కులను దక్కించుకొను సినిమాను తెరకెక్కించాలని డిసైడ్ అయ్యాడు. మల్టి స్టారర్ కథ కావడంతో నరేష్ కి ఈక్వల్ గా సునిల్ అయితే సరిగ్గా సెట్ అవుతాడని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే సునీల్ కి కథను కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఇక సినిమా జనవరిలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.