Begin typing your search above and press return to search.
అల్లరోడిని పరిపూర్ణం చేసిన మహర్షి
By: Tupaki Desk | 10 May 2019 6:53 AM GMTనిన్న రిలీజైన మహర్షి టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ళ జాతర సాగిస్తున్నాడు. టాక్ కొంత డివైడ్ గా ఉన్నప్పటికీ మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు రైతులకు సంబంధించి ఇచ్చిన మెసేజ్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా ఉండటంతో ప్రేక్షకులకు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ గా మహర్షి రన్ బాగానే సాగేలా ఉంది. ఇందులో రవి పాత్ర పోషించిన అల్లరి నరేష్ కు చాలా పేరు వస్తోంది.
నిజానికి కథలో కీలకమైన మలుపుకు కారణమయ్యే పాత్రలో నరేష్ నటన చాలా సెటిల్డ్ గా ఉంది. ఊరివాళ్ళ కోసం పోరాడే పాత్రలో బాగా చేశాడు. కొన్ని సన్నివేశాల్లో మహర్షి పాత్రకంటే రవిలోనే ఔన్నత్యం ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే అల్లరోడికి మంచి ప్రశంశలు దక్కుతున్నాయి. కాకతాళీయంగా మొదటి సినిమా అల్లరి ఇప్పుడు యాభై ఐదో మూవీ మహర్షిలో నరేష్ పాత్ర పేరు రవినే
ఈ రోజుతో అల్లరి నరేష్ 17 ఏళ్ళ కెరీర్ పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. పదిహేడేళ్ళ క్రితం ఎవరికి తెలియని ఓ కుర్రాడు ఇండస్ట్రీలో నిలదోక్కుకుంటాడా అనే సంశయాల మధ్య 55 సినిమాలు పూర్తి చేసుకోవడానికి కారణం ప్రేక్షకులే అంటూ వాళ్ళకు కృతజ్ఞతలు తెలిపాడు.
మహర్షిలో రవి పాత్ర ద్వారా తన కెరీర్ ఫుల్ సర్కిల్ అదే సంపూర్ణంగా అయ్యిందని భావిస్తున్నానని ఇకపై కూడా అందరికి నచ్చే విధంగా సినిమాలు ఎంచుకుంటానని చెప్పాడు. మొత్తానికి గత రెండు మూడేళ్లుగా సరైన సినిమా లేక ఉనికిని ప్రమాదంలో పడేసుకున్న అల్లరి నరేష్ మహర్షి ఫైనల్ రిజల్ట్ తో సంబంధం లేకుండా తనవరకు కోరుకున్న పేరుని మార్కులను కొట్టేశాడు