Begin typing your search above and press return to search.

హ్యాపీ ఎండింగ్ సినిమాల్లోనే..

By:  Tupaki Desk   |   27 Dec 2017 4:31 AM GMT
హ్యాపీ ఎండింగ్ సినిమాల్లోనే..
X
సినిమా అన్నదో అందమైన రంగుల ప్రపంచం. ఇక్కడ అందరినీ ఆకట్టుకునే తళుకుబెళుకులెన్నో ఉంటాయి. అదే టైంలో బయట ప్రపంచం చూడని కష్టాలు.. కన్నీళ్లు చాలానే ఉంటాయి. కాకుంటే అవెక్కడా పెద్దగా హైలైట్ అవ్వవు. సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ అవ్వాలనే ఆశతో వచ్చేవారిలో నూటికి 90 మంది సక్సెస్ అవలేరు. ఈ విషయం సినిమా వాళ్ల జీవితాలను దగ్గర నుంచి చూసేవాళ్లకే తెలుస్తుందన్నాడు అల్లరి నరేష్.

ఇండస్ట్రీలో పేదరికంలో మగ్గుతూ కష్టాలు పడుతున్న కళాకారులను ఆర్థికంగా ఆదుకునేందుకు నిర్వహిస్తున్న మనం సైతం ప్రోగ్రాంకు రీసెంట్ గా వచ్చిన అల్లరి నరేష్ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. ‘‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగసిపోతే నిబిడాశ్చర్యంతో మీరే.. నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యం మీరే అంటూ మహాకవి శ్రీశ్రీ రాసిన ఈ కవిత సినిమా ఇండస్ట్రీకి కరెక్ట్ గా సరిపోతుంది. లైమ్ లైట్ లో ఉన్నవాళ్లు అందరికీ కనపడతారు. ఫైటర్స్.. డ్రైవర్స్.. క్రేన్ ఆపరేటర్స్.. ప్రొడక్షన్ వాళ్లు ఇలా చాలామంది బయటకు కనిపించరు. ఏజ్ ఉన్నంతవరకు.. శరీరం సహకరించినంత వరకు ఎలాగో నటించినా తరవాత ఎలాగో గడపాలి. నేను యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకునేటప్పుడు 106 మంది ఉండేవాళ్లం. అందులో ఆరుగురం యాక్టర్లమయ్యామంతే. మిగతా వాళ్లందరూ ఏమైపోయారో తెలియదు’’ అంటూ నరేష్ ఇండస్ట్రీలో కనిపించని యాంగిల్ గురించి చెప్పుకొచ్చాడు.

సినిమాల్లో చాలావరకు హ్యాపీ ఎండింగ్స్ ఉంటాయి. కానీ సినిమావాళ్ల జీవితాలు చాలావరకు హ్యాపీ ఎండింగ్ ఉండవని నరేష్ చెప్పేశాడు. కాకపోతే సినిమా వాళ్లం ఇవన్నీ బయటకు చెప్పుకోలేమంతే అని నవ్వుతూ అనేశాడు. సినిమాల్లో పంచ్ డైలాగులతో కామెడీ చేసినా స్టేజీపై మాత్రం డెప్త్ గా ఆలోచింపజేసేలానే మాట్లాడాడు నరేష్. కీపిటప్.