Begin typing your search above and press return to search.

మూడో 'సారీ' అల్లరి పాలే!!

By:  Tupaki Desk   |   12 Sep 2018 5:56 AM GMT
మూడో సారీ అల్లరి పాలే!!
X
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక హీరో తన కెరీర్ మొత్తం యాభై సినిమాలు చేస్తే అదో గొప్ప ఘనతగా చూడాలి. వందల కోట్ల మార్కెట్ ఉన్న ఇప్పటి తరం స్టార్ హీరోలు సైతం ఇంకా పాతిక సినిమా దగ్గరే ఉన్నారు. అలాంటిది పరిశ్రమకు వచ్చిన 16 ఏళ్ళలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేయటం అంటే చిన్న విషయమా. అల్లరి నరేష్ దాన్ని సాధ్యం చేసి చూపించాడు. ఒక టైం లో నరేష్ సినిమా వస్తోంది అంటే హాయిగా నవ్వుకోవచ్చు అని టైటిల్ చూసి జనం సినిమా హాల్ కు వెళ్ళేవాళ్ళు. అదంతా ఇప్పుడు గతం. వర్తమానానికి వస్తే అల్లరి నరేష్ టైం ఏ మాత్రం బాగాలేదు. ఏ జానర్ చేసినా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. తనను వాడుకుని నవ్వించే క్రమంలో దర్శక రచయితలు ఒకే తరహా రొటీన్ ఫార్ములాలో వెళ్తూ ఉండటంతో మనోడికి ఎదురు దెబ్బలు తప్పలేదు. కాస్త సీరియస్ గా బందిపోటు చేసినా ప్రేమ కథను మిక్స్ చేసి మేడ మీద అబ్బాయిగా వచ్చినా అన్ని తిరస్కారానికి గురైనవే. తాజాగా సునీల్ తో కలిసి చేసిన సిల్లీ ఫెలోస్ తనకు కం బ్యాక్ మూవీలా మిగులుతుంది అనుకుంటే ఇది కూడా వాటిదారిలోనే వెళ్లడం ఫ్యాన్స్ కి నిరాశ కలిగిస్తోంది.

అల్లరి నరేష్ గత రెండు సినిమాలు ఇంట్లో దెయ్యం నాకేం భయం-మేడ మీద అబ్బాయి రెండు నిరాశాజనక ఫలితాన్ని ఇచ్చాయి. సిల్లీ ఫెలోస్ విడుదలకు ముందు 5.5 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ చేసింది. నిన్నటి దాకా వచ్చిన వసూళ్లు చూసుకుంటే అతి కష్టం మీద 2.25 కోట్లు దాటేశాయి. కానీ మొన్న నుంచే డ్రాప్ కనిపించడం మొదలైంది. దీని కన్నా పాతిక రోజుల క్రితం విడుదలైన గీత గోవిందం స్టార్లు లేకుండా వచ్చిన కేరాఫ్ కంచరపాలెం మెరుగ్గా రాబట్టడం ఆశ్చర్యం కలిగించే విషయమే. సో రేపు రెండు సినిమాలు వస్తున్నాయి కాబట్టి సిల్లీ ఫెలోస్ ఇక కోలుకోవడం కష్టమే అని ట్రేడ్ టాక్. హ్యాట్రిక్ ప్లాప్స్ అని కాదు కానీ అల్లరి నరేష్ సుడిగాడు తర్వాత అందుకున్న పరాజయాల సంఖ్య అక్షరాలా 12. ఇప్పుడు సిల్లీ ఫెలోస్ పదమూడోది. ఇలా చాలా బ్యాడ్ టైంలో ఉన్న నరేష్ అర్జంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ పడాలి. మహేష్ బాబు మహర్షిలో చేస్తున్న పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉన్నా ప్రిన్స్ చార్మ్ ముందు ఎంతవరకు హై లైట్ కాగలడు అనేది వేచి చూడాలి. సోలో హిట్ చూసి ఏళ్ళు గడుస్తున్న నరేష్ కు గుడ్ టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మరి.