Begin typing your search above and press return to search.
50తో అల్లరోడు ఫామ్ లోకి వస్తాడా?
By: Tupaki Desk | 5 Nov 2015 9:30 AM GMTఅత్యంత వేగంగా 50 సినిమాల క్లబ్ లోకి చేరుతున్న టాలీవుడ్ హీరోగా అల్లరి నరేష్ పేరు మార్మోగిపోతోంది. మామ మంచు-అల్లుడు కంచు అతడు నటిస్తున్న 50వ సినిమా. మామగా మోహన్ బాబు - అల్లుడుగా అల్లరోడు అదరగొట్టేస్తారన్న అంచనాలేర్పడ్డాయి. కలెక్షన్ కింగ్ మరోసారి ఇద్దరు నాయికల సరసన నటిస్తున్నాడు. అలనాటి మేటినాయికలు రమ్యకృష్ణ - మీనా మోహన్ బాబు సరసన మరోసారి సందడి చేస్తున్నారు.
చాలా గ్యాప్ తర్వాత ఈ కలయికలో సినిమా అనగానే ఎంతో ఎగ్జయిట్ మెంట్ పెరిగింది. సేమ్ టైమ్ అల్లరి నరేష్ సరసన సీమటపాకాయ్ ఫేం పూర్ణ కథానాయికగా నటిస్తోంది. నరేష్ సరసన ఈ అమ్మడు ఇప్పటికే రెండు సినిమాల్లో నటించింది. ఇప్పుడు హ్యాట్రిక్ కొడుతోంది. అయితే అంతా బాగానే ఉంది.కానీ ఓ చిక్కుంది. ఇటీవలి కాలంలో అల్లరోడి గ్రాఫ్ ఏమాత్రం బాలేదు. వరుసగా పరాజయాలు పలకరిస్తున్నాయి. సుడిగాడు సునామీ కలెక్షన్స్ తర్వాత అతడి సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డాయి. అందుకే మామ మంచు-అల్లుడు కంచు అతడికి ఎంతో కీలకమైన సినిమా.
అటు మోహన్ బాబుకి, ఇటు అల్లరోడికి కీ ఇచ్చే మూవీ ఇది. అసలే నరేష్ నటిస్తున్న ల్యాండ్ మార్క్ సినిమాగా పాపులర్ అయ్యింది కాబట్టి ఈ మూవీ సెంటిమెంటుగా అయినా హిట్టు కొట్టాల్సిందే. ఈ చిత్రంతో నరేష్ ఫామ్ లోకి వచ్చి 100 సినిమాల ట్రాక్‌లోకి రావాల్సిందే. ఇ.వి.వి లేకపోయినా నరేష్ ఆ వారసత్వాన్ని నిలబెట్టాడన్న పేరు వచ్చేది అప్పుడే. అతడు 100 సినిమాల హీరోగా చూడాలన్నది అభిమానుల ఆశ. అది నెరవేరుతుందనే ఆశిద్దాం.