Begin typing your search above and press return to search.

నితిన్.. తరుణ్.. అల్లరోడు ఎటువెళ్తాడో?

By:  Tupaki Desk   |   14 July 2016 5:42 AM GMT
నితిన్.. తరుణ్.. అల్లరోడు ఎటువెళ్తాడో?
X
హీరోగా సక్సెస్ సాధించడం ఒకెత్తయితే.. ఆ సక్సెస్‌ ను నిలబెట్టుకోవడం మరో ఎత్తు. మిగతా రంగాలతో పోలిస్తే సినిమా ఫీల్డులో సక్సెస్ రేట్ బాగా తక్కువ. కాబట్టి కన్సిస్టెంట్‌ గా సక్సెస్‌ లు ఇస్తూ హీరోగా కంటిన్యూ అవడం అంత సులువైన విషయం కాదు. కొందరు కొన్ని ఫెయిల్యూర్లు ఎదురైనా పట్టుదలతో నిలబడతారు. ఇంకొందరు ఫ్లాపుల దెబ్బకు కుదేలై కనుమరుగైపోతారు. తెలుగు పరిశ్రమలో రెండు రకాల కథానాయకులూ కనిపిస్తారు.

ఎన్ని ఫెయిల్యూర్లు ఎదురైనా ఆశ వదులుకోకుండా మళ్లీ హీరోగా సక్సెస్ అయిన కథానాయకుల్లో ముందు ఉదాహరణగా చెప్పాల్సింది నితిన్ గురించే. కెరీర్ మొదట్లోనే హ్యాట్రిక్ హిట్లతో దూసుకెళ్లిన నితిన్.. ఆ తర్వాత వరుసగా డజనుకు పైగా ఫ్లాపులొచ్చినా స్థైర్యం కోల్పోలేదు. మళ్లీ ‘ఇష్క్’ సినిమాతో హిట్టు కొట్టి నిలబడ్డాడు. మరోవైపు తరుణ్ సంగతి చూస్తే.. అతను కూడా ఆరంభంలో అదిరిపోయే హిట్లిచ్చాడు. కానీ ఆ తర్వాత వరుస ఫ్లాపులతో కనుమరుగైపోయాడు. ఇప్పుడు అల్లరి నరేష్ పరిస్థితి చూస్తే.. ఒకప్పుడు నితిన్ - తరుణ్ ఎదుర్కొన్న పరిస్థితిలోనే ఉన్నాడు.

చివరగా నాలుగేళ్ల కిందట ‘సుడిగాడు’తో హిట్టు కొట్టాడు నరేష్. ఆ తర్వాత పది సినిమాల దాకా చేశాడు. అన్నీ ఫెయిల్యూర్లే. ఇప్పుడు ‘సెల్ఫీరాజా’ మీదే అతడి ఆశలన్నీ ఉన్నాయి. ఒకప్పుడైతే నరేష్ సినిమాలు ఫ్లాపైనా పెట్టుబడి వచ్చేసేది. ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఓపెనింగ్స్ కూడా రాని పరిస్థితి. నెగెటివ్ టాక్ వస్తే అడ్రస్ లేకుండా పోతోంది సినిమా. మరి అల్లరోడు ‘సెల్ఫీ రాజా’ సినిమాతో మళ్లీ హిట్టు కొట్టి నితిన్ లాగా నిలబడతాడా..? లేక మరో ఫ్లాప్ ఖాతాలో వేసుకుని తరుణ్ తరహాలో ఫేడవుట్ అయిపోయే దిశగా అడుగులేస్తాడా..? ఈ శుక్రవారమే తేలిపోతుంది.