Begin typing your search above and press return to search.

దెయ్యంతో కలిసి అల్లరోడు గుడ్ బై

By:  Tupaki Desk   |   13 Dec 2016 3:59 AM GMT
దెయ్యంతో కలిసి అల్లరోడు గుడ్ బై
X
అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ ఇంట్లో దెయ్యం-నాకేం భయం. ఇప్పటికే అల్లరోడి ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేసి ఉండాల్సింది. నవంబర్ 13న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని.. అన్నీ రెడీ చేసుకుంటున్న టైంలో.. మోడీ పేల్చిన కరెన్సీ పంచ్ కి నిరవధికంగా వాయిదా పడిపోయిందీ చిత్రం. మిగతా సినిమాలు కాస్త ముందూవెనకా చూసుకుని వచ్చేస్తున్నా.. వెయిట్ అండ్ సీ పాలసీ అప్లై చేసిన అల్లరి నరేష్.. మొత్తానికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు.

డిసెంబర్ 30న ఇంట్లో దెయ్యం-నాకేం భయం రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ మెంట్ వచ్చింది. డీమానిటైజేషన్ కి వెల్ కం చెప్పాల్సిన ఈ చిత్రం.. 2016కే గుడ్ బై చెప్పే రేంజ్ లో ప్లాన్ చేయడం విశేషం. సహజంగా ఇయర్ ఎండింగ్ రోజున జనాలు వేరే ఎంజాయ్మెంట్ మూమెంట్లో ఉంటారనే ఉద్దేశ్యంతో సినిమాలు రిలీజ్ చేసేందుకు ఆలోచిస్తారు కానీ.. అల్లరోడికి ఈ పాటి చిన్న రిస్క్ అయినా తీసుకోక తప్పలేదు.

నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఇంట్లో దెయ్యం-నాకేం భయం చిత్రంతో అల్లరి నరేష్ ట్రాక్ ఎక్కేస్తాడనే అంచనాలే ఉన్నాయి. బి వీ ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాత కావడంతో.. సాధారణ హారర్ కామెడీ చిత్రాలకు మించి రిచ్ గా ఉన్న ప్రొడక్షన్ వాల్యూస్.. సినిమాకు హైలైట్ కానున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/