Begin typing your search above and press return to search.

దెయ్యం సినిమాలో చాలా క్రొత్తగా...

By:  Tupaki Desk   |   10 Oct 2016 5:21 AM GMT
దెయ్యం సినిమాలో చాలా క్రొత్తగా...
X
కామెడీ హీరో అల్లరి నరేష్.. తన రేంజ్ కి తగ్గదే కాదు అసలు హిట్ కొట్టే చాలా కాలం అయిపోయింది. సుడిగాడు మూవీతో సడెన్ స్టార్ అయిపోయి.. స్టార్ హీరోలతో సమానంగా వసూళ్లు రాబట్టిన ఈ హీరో.. ఆ తర్వాత ఒక్కటంటే ఒక్కటి కూడా ఆ స్థాయి సినిమా ఇవ్వలేకపోయాడు. ఎప్పటికప్పుడు కొత్తగా అంటున్నాడు కానీ ఆడియన్స్ మాత్రం కొత్తగా ఫీలవకపోవడంతో రిజల్ట్ తేడా వచ్చేస్తోంది.

కానీ ఇప్పుడు మాత్రం నిజంగానే ఛేంజ్ చూపించబోతున్నాడు అల్లరి నరేష్. త్వరలో 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయ్యం' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ కామెడీ హీరో.. తన ప్రతీ యాంగిల్ లోనూ మార్పు చూపిస్తాడని అంటున్నారు. మేనరిజమ్స్ నుంచి డైలాగ్ డెలివరీ వరకూ ప్రతీ విషయంలోనూ కొత్తగా ట్రై చేశాడని అంటున్నారు. ఈ సినిమా చూసిన జనాలకు అల్లరి నరేష్ కొత్తగా కనిపించడం కాదు.. కొత్త అల్లరి నరేష్ కనిపిస్తాడని యూనిట్ వర్గాలు కాన్ఫిడెంట్ గా చెబుతున్నాయంటే.. ఏ రేంజ్ లో కొత్తగా ట్రై చేశాడో అర్ధమవుతుంది.

హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఇంట్లో దెయ్యం నాకేం బయ్యం మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో బీవీఎస్ ఎన్ ప్రసాద్ భారీగా నిర్మిస్తుండడం కూడా మూవీకి స్పెషల్ అట్రాక్షన్ కానుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/