Begin typing your search above and press return to search.
అల్లరి నరేష్ గోడు వినండి
By: Tupaki Desk | 27 Dec 2016 10:30 PM GMTఒకప్పుడు అల్లరి నరేష్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్నట్లుండేది. అతడి సినిమా హిట్టయితే కాసుల పంటే. ఫ్లాప్ అయినా పెట్టుబడికి ఢోకా ఉండేది కాదు. ఒక సినిమా పోయినా.. ఇంకో సినిమా ఆడేసేది. కానీ గత నాలుగేళ్లుగా నరేష్ హిట్టు ముఖం చూడలేదు. ‘సుడిగాడు’. సినిమాతో సూపర్ హిట్ కొట్టిన తర్వాత అతడికి సక్సెసే లేదు. ఈ నేపథ్యంలో తన కెరీర్ ఎలా దెబ్బ తిన్నది.. క్యారెక్టర్ల ఎంపికలో ఎందుకు తాను ఒక పరిధిలో కూరుకుపోయింది తాజాగా ఒక ఇంటర్వ్యూలో వివరించాడు నరేష్.
‘‘సుడిగాడు సినిమా నాకు మంచితో పాటు చెడు కూడా చేసింది. నా కెరీర్ కు అది ‘మగధీర’ లాగా తయారైంది. తర్వాత వచ్చిన ప్రతి సినిమాలోనూ కామెడీనే ఉండాలనే ఉద్దేశంతో ఫైట్లలో.. సెంటిమెంట్ సీన్లలో.. డాన్సుల్లో కామెడీ పెడుతూ వచ్చారు. దీంతో మిగతా ఎమోషన్లు పక్కకు వెళ్లిపోయాయి. నాకంటే ముందు చాలామంది స్పూఫులు.. పేరడీలు చేశారు. కానీ వాటికి ఎక్కువ ప్రచారం తెచ్చిందే నేనే కావడంతో దీని తాలూకు బ్లేమ్ నేనే తీసుకోవాల్సి వచ్చింది. ఇక ఓ నటుడిగా నాకు ఎమోషనల్ సినిమాలు.. సీరియస్ సినిమాలు చేయాలని ఉంటుంది. యాక్షన్ సినిమాలు చెయ్యాలని మాత్రం అనుకోను. అలాంటి సినిమాలు చెయ్యడానికి తగిన పర్సనాలిటీ నాకు లేదు. ఐతే ప్రేక్షకులు నా సినిమా అంటే కామెడీని ఆశిస్తారు. నేను కొంచెం డిఫరెంటుగా చేసిన సినిమాలు సక్సెస్ కాలేదు. అందుకుఏ వెరైటీ సినిమాలు చేయడానికి ధైర్యం సరిపోవట్లదు అని చెప్పాడు నరేష్.. చెయ్యడానికి ధైర్యం సరిపోవట్లేదు. నాకు తెలిసి అన్ని రకాల ఎమోషన్స్ లో కామెడీ చెయ్యడం చాలా కష్టం. ఆ కామెడీ చేయడాన్ని నేను బాగా ఆస్వాదిస్తున్నా’’.. అని నరేష్ చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/