Begin typing your search above and press return to search.
సీరియస్ నరేష్ గా ప్రశంసలు అందుకుంటున్న అల్లరి నరేష్..!
By: Tupaki Desk | 21 Feb 2021 3:30 AM GMTఅల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ ''నాంది'' నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సరికొత్త పాయింట్ తో కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని ఎస్.వీ 2 ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై సతీష్ వేగేశ్న నిర్మించాడు.
ఈ సినిమా లో నరేష్ యాక్టింగ్ కి క్రిటిక్స్ మరియు ఆడియన్స్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది. తన కెరీర్ లోనే ఛాలెంజింగ్ రోల్ లో.. అండర్ ట్రయిల్ పాత్రలో నరేష్ జీవించడానే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. 'అల్లరి' సినిమా నుంచి గత కొన్నేళ్లుగా వెండితెరపై తనదైన హాస్యంతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న నరేష్.. ఈసారి తన పంథా మార్చి ఆకట్టుకున్నాడు.
'నాంది' చిత్రంలో అతని నటనలో వెరీయేషన్ తో పాటుగా భిన్నమైన వాయిస్ మాడ్యులేషన్ లో డబ్బింగ్ చెప్పిన విధానాన్ని అందరూ అభినందిస్తున్నారు. 'నాంది' సినిమాతో ఇక అల్లరి నరేశ్ కాస్త సిరీయస్ నరేశ్ అయినట్లేనని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.
ఎందుకంటే ఇకపై ఈ తరహా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి అల్లరోడు ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. చిన్న నిర్మాతలకు పెద్ద దిక్కుగా ఉంటున్న నరేష్.. తన తండ్రి స్థాపించిన 'ఈవీవీ సినిమా' బ్యానర్ లో సినిమాలు తీయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లుగా సమాచరం. 'నాంది' సినిమాతో నూతనోత్సాహంలో ఉన్న నరేష్.. రాబోయే రోజుల్లో నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా సక్సెస్ అవుతాడేమో చూడాలి.