Begin typing your search above and press return to search.
అల్లరోడి హంగామా 24న!
By: Tupaki Desk | 12 July 2015 11:44 PM GMTఇప్పుడొస్తున్న చాలా సినిమాలది వారం రోజుల హడావుడే. ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా... వీకెండ్ అవ్వగానే చాలా థియేటర్లలో తట్టా బుట్టా సర్దేస్తుంటాయి. ఇక రెండో వారంలోపు మళ్లీ కనిపించదు. వసూళ్లు అంతొచ్చాయి, ఇంతొచ్చాయి అంటూ హిట్టు పేరుతో లెక్కలు చెప్పుకోవడంలోనూ, నిజంగా వసూళ్లు వస్తే సక్సెస్ పార్టీలు చేసుకోవడంలోనూ నిమగ్నమైపోతుంటాయి ఆయా టీమ్‌లు. `బాహుబలి`ని అలాగే అంచనా వేశారు. ఎంత హడావుడి చేసినా వారం లోపు కొన్నిథియేటర్లలోనైనా సినిమా ఖాళీ అవుతుంది కదా అనుకొన్నారు. ఆ నమ్మకంతోనే అల్లరి నరేష్ `జేమ్స్‌బాండ్`ని బాహుబలి విడుదలయ్యాక వారం రోజులకే అంటే 17వ తేదీన విడుదల చేయాలని ఫిక్స్ అయిపోయారు. అయితే బాహుబలి అన్ని సినిమాల్లా కాదని నిరూపిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. థియేటర్ల నుంచి ఇప్పట్లో కదలనంటోంది. దీంతో సినిమాలన్నీ మరో దఫా వాయిదాల పర్వం కొనసాగిస్తున్నాయి.
అల్లరి నరేష్ `జేమ్స్‌బాండ్` సినిమాని 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్రబృందం కొత్త డేట్‌ని ప్రకటించింది. మామూలుగా అయితే 24న డైనమైట్, రుద్రమదేవి, కిక్2 తదితర సినిమాలు రావాలనుకొన్నాయి. కానీ అల్లరోడి సినిమానే 24కి వాయిదా పడింది కాబట్టి పై మూడు చిత్రాలు ఎప్పుడొస్తాయో తెలియదు. `రుద్రమదేవి`, `కిక్2` చిత్రాల్ని నైజామ్‌లో దిల్‌రాజే కొన్నాడు. `బాహుబలి`ని కూడా ఆయనే కొన్నారు. సో... బాహుబలికి వసూళ్లు తక్కువయ్యాయని ఎప్పుడనిపిస్తే అప్పుడు కొన్ని థియేటర్లని ఖాళీ చేసి వేరే చిత్రాల్ని తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత `బాహుబలి` రూపంలో రెండు మూడు వారాలపాటు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ఆడే సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చినట్టైంది.