Begin typing your search above and press return to search.

మహర్షి తర్వాత డిస్కో రాజా ?

By:  Tupaki Desk   |   6 Jun 2019 9:27 AM GMT
మహర్షి తర్వాత డిస్కో రాజా ?
X
సోలో హీరోగా చాలా వేగంగా హాఫ్ సెంచరీ సినిమాలు పూర్తి చేసుకున్న రికార్డు సొంతం చేసుకున్న అల్లరి నరేష్ గత కొంత కాలంగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు. అందుకే మహర్షిలో కీలకమైన సపోర్టింగ్ రోల్ కు సైతం ఓకే చెప్పి నటనతో దాని విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. చూస్తుంటే బలమైన సపోర్టింగ్ రోల్స్ కు అల్లరి నరేష్ బెస్ట్ ఆప్షన్ గా నిలిచేలా కనిపిస్తున్నాడు.

ఫ్రెష్ అప్ డేట్ ప్రకారం రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న డిస్కో రాజాలో అల్లరోడికి కీలక పాత్ర ఆఫర్ చేశారట. ముందు సునీల్ ని అనుకున్నప్పటికీ మహర్షిలో నరేష్ పెర్ఫార్మన్స్ చూసి తనైతే ఇంకా బాగా సెట్ అవుతాడనే ఉద్దేశంతో ఆలోచన మార్చుకున్నారట. ఇది అధికారికంగా తెలియాల్సి ఉంది. ఇది ఒకరకంగా మంచి అడుగే కాని అల్లరి నరేష్ ఇదే కొనసాగిస్తే హీరోగా అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం లేకపోలేదు.

బంగారు బుల్లోడు ఆల్రెడీ నిర్మాణంలో ఉంది. ఇంకో రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. ఈ టైంలో ఇలా స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ వైపు మొగ్గు చూపితే మార్కెట్ పరంగా నిర్మాతలు కథానాయకుడిగా తీసేందుకు అంత సాహసించరు. అయినా నాలుగేళ్ళుగా చెప్పుకోదగ్గ హిట్ లేక ఇంకా ఎదురు చూడటం కంటే ఇదే బెటరని నరేష్ ఫీలవుతున్నాడేమో. గత ఏడాది మూడు డిజాస్టర్లు చవి చూశాక రవితేజ కొంత గ్యాప్ తీసుకుని ఈ డిస్కో రాజా చేస్తున్నాడు. షూటింగ్ జరుగుతోంది. నరేష్ పాత్రకు సంబంధించి అధికారిక ప్రకటన మరికొద్ది రోజుల్లో రావొచ్చు