Begin typing your search above and press return to search.

మేడ మీద అబ్బాయి అల్లరి తగ్గింది

By:  Tupaki Desk   |   23 May 2017 8:15 AM GMT
మేడ మీద అబ్బాయి అల్లరి తగ్గింది
X
మన తెలుగులో హీరోలు ఎక్కువగా ప్రేమ కథలు లేకపోతే యాక్షన్ కథలు చేస్తారు. కానీ పూర్తి వినోదభరిత సినిమాలు చేయడం ఏ కొద్దిమంది హీరోలు వలనో అవుతుంది. ఆ వరుసలో మొదట ఉంటాడు అల్లరి నరేష్. అసలు సినిమాల్లోకి వచ్చిందే కామిడీ హీరోగా. ఇతని రాకతో తెలుగు సినిమాకు మరో రాజేంద్రప్రసాద్ దొరికాడు అని అన్న వాళ్ళు కూడా లేకపోలేదు. అది కూడా నిజమే లెండి.

కాకపోతే ఈ అల్లరిరోడుకి కాస్త బద్దకం ఎక్కువ అని ఇండస్ట్రిలో ఒక టాక్. షూటింగ్ కు ఎప్పుడూ టైమ్ కి రాడని.. పిలిచింది పొద్దున అయితే తీరుబడిగా ఏ మధ్యాహ్నమో వస్తాడంట. కాని పెళ్ళయిన తరువాత నరేష్ పూర్తిగా మారిపోయాడు అని వాళ్ళు ఫ్రెండ్స్ చెబుతున్నారు. నైట్ పార్టీలుకు వెళ్ళడం పూర్తిగా మానేశాడట. పైగా ఇప్పుడు తండ్రి అయిన తరువాత పక్కా జెంటిల్ మాన్ లా మారిపోయాడని అతనితో పని చేసిన వాళ్ళు అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. నరేష్ కొత్త సినిమా ‘మేడ మీద అబ్బాయి’ షూటింగ్ వరుసపెట్టి 55 రోజులు ఒకటే షెడ్యూల్ లో పూర్తిచేశారట. ఇక నరేష్‌ ప్రతీరోజూ టైముకి వచ్చేసి.. లేటుగా వెళ్లేవాడట నరేష్.

చిన్న నిర్మాతలును చిన్న సినిమాలుకు పెద్ద విజయం అందించిన నరేష్ ఇప్పుడు వరుస ఫ్లాప్ లతో డీలా పడ్డాడు. అందుకే అన్నిటిని మార్చుకుంటూ వస్తున్నాడు. తన ప్రవర్తన తన సినిమాల ఎంపిక అన్నీ ఒక్కక్కోటిగా మారుస్తున్నాడు. పెళ్ళికి ముందు నేను వేరు తండ్రిని అయన తరువాత నేను వేరు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఒక టాలెంటెడ్ నటుడుకి పద్దతి తోడైతే మరింత చక్కటి విజయాలు వస్తాయి కదా. ఇప్పుడు రాబోతున్న మేడ మీద అబ్బాయి మరి ఎంత కొత్తగా ఉంటుందో చూడాలి.