Begin typing your search above and press return to search.

అల్లరి హీరోకి వర్కవుటవుతుందా

By:  Tupaki Desk   |   25 Dec 2017 4:17 AM GMT
అల్లరి హీరోకి వర్కవుటవుతుందా
X
కాలం ఏదైనా కామెడీ పిక్చర్లకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. మామూలు స్టోరీయే అయినా ఆసాంతం నవ్వించగలిగితే చాలు.. కమర్షియల్ గా కాసులు బాగానే వస్తాయి. కామెడీ హీరోగా మంచి ఇమేజ్ ఉండి.. కామెడీ చేయడంలో మంచి టైమింగ్ ఉండి కూడా హిట్ కోసం మొహం వాచిపోయేలా ఎదురుచూస్తున్నాడు అల్లరి నరేష్. సబ్జెక్టులు ఎంచుకోవడంలో చేస్తున్న తప్పిదాల వల్ల వరసగా ఫ్లాపులే ఎదురవుతున్నాయి.

ఆచితూచి అడుగులు వేయాల్సిన ఈ తరుణంలో అల్లరి నరేష్ తన తరవాత సినిమా పి.వి.గిరి అనే డైరెక్టర్ తో చేయడానికి అంగీకరించాడని తెలుస్తోంది. ఇతడు ఇంతకుముందు సీనియర్ యాక్టర్ నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ నందిని నర్సింగ్ హోం సినిమా తీశాడు. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా కామెఢీ ఫర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. తన రెండో సినిమా కూడా కామెడీతో తీయాలని భావించి అల్లరి నరేష్ ను కలిసి స్క్రిప్ట్ వినిపించాడని తెలుస్తోంది. ‘‘గిరి సబ్జెక్టుపై బాగానే వర్క్ చేశాడు. స్క్రిప్ట్ నెరేట్ చేసిన తీరు నరేష్ కు నచ్చింది. దాంతో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. తొందరలో మిగతా విషయాలు ఫైనల్ అవుతాయి’’ నరేష్ సన్నిహితుడు ఒకరు తెలిపారు.

ఈ ఏడాది అల్లరి నరేష్ సినిమా మేడమీద అబ్బాయి ఒక్కటే రిలీజైంది. మళయాళ మూవీకి రీమేక్ గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఒకప్పుడు అల్లరి నరేష్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే పేరుండేది. కానీ ఈ మధ్య ఆ ముద్ర పోయి వరస ప్లాపుల రేంజికి కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. మళ్లీ ఓ కమర్షియల్ హిట్ పడితే తిరిగి ఫాం వచ్చే సత్తా అతడికి ఉన్నా ఆ హిట్టే అందని ద్రాక్ష అయి కూర్చుంది.