Begin typing your search above and press return to search.
అల్లరోడికి వెయిటింగ్ తప్పదు
By: Tupaki Desk | 11 July 2015 11:11 AM GMTబాహుబలికి ఎంత క్రేజ్ ఉన్నా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం థియేటర్లను ఆక్రమించేసినా.. ఒక వారం తర్వాత జోరు తగ్గిపోతుందనే అనుకున్నాడు అల్లరి నరేష్. బాహుబలి విడుదలవడానికి వారం ముందే.. ఆ సినిమా వచ్చిన వారానికి, అంటే జులై 17న తన సినిమా 'జేమ్స్‌బాండ్'ను రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్‌మెంట్ ఇప్పించేశాడు. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే బాహుబలి హవా రెండు వారాలకైనా తగ్గుతుందా అన్నది సందేహంగానే కనిపిస్తోంది. ప్రస్తుతానికి బాహుబలి బుకింగ్స్ తొలి వారం వరకే పరిమితం చేశారు. చాలా వరకు టికెట్లు అయిపోయాయి. సోమవారం నుంచి కూడా జోరు తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. వారం పూర్తిగా హౌస్‌ఫుల్స్ పడే పరిస్థితి కనిపిస్తోంది.
రెండో వీకెండ్‌కు కూడా టికెట్ల కోసం గట్టి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అప్పటికి కూడా థియేటర్లు తగ్గే ప్రసక్తే కనిపించట్లేదు. మళ్లీ మళ్లీ ఇలాంటి సినిమా రాదనే ఉద్దేశంతో డిమాండ్ ఉన్నంత కాలం బాహుబలి సినిమాను థియేటర్లలో నడిపించడానికి ఎగ్జిబిటర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రేక్షకులు కూడా మరో ఆప్షన్ కోసం చూసే పరిస్థితి లేదు. చూసిన వాళ్లు మళ్లీ మళ్లీ బాహుబలి చూసే అవకాశముంది. రెగ్యులర్‌గా సినిమాలు చూడని ఆడియన్స్‌లోనూ బాహుబలి మీద ఆసక్తి కనిపిస్తోంది కాబట్టి.. రెండో వీకెండ్ కూడా హౌస్‌ఫుల్స్ ఖాయంగా కనిపిస్తోంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో 'జేమ్స్‌బాండ్' విడుదలైతే కష్టాలు తప్పవు. అసలే అల్లరోడు వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. జేమ్స్‌బాండ్ మీద అతడికి భారీ ఆశలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రిస్క్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి 23వ తారీఖు మీద దృష్టిపెడితే బెటరేమో.