Begin typing your search above and press return to search.
స్ఫూఫ్స్ లేకుండా కామెడీ చేస్తావా?
By: Tupaki Desk | 8 July 2016 4:49 AM GMTస్పూఫ్ లతో కామెడీ.. గతంలో ఇలాంటివి ఒకటీ అరా కనిపించేవి. ఇప్పుడు ఏ సినిమాలో కామెడీ చూసినా ఏమున్నది గర్వకారణం.. టాలీవుడ్ కామెడీ మొత్తం స్పూఫ్ లే కదా సమస్తం.. అన్నట్లుగా తయారైపోయాయి. మంచి యాక్టర్ గా గుర్తింపు పొంది.. కామెడీ హీరోగా ఎనలేని క్రేజ్ ఉన్న అల్లరి నరేష్ కూడా ఇన్నేళ్లు వీటితోనే రోజులు నెట్టుకొచ్చేశాడు. అప్పుడెప్పుడో కేవలం స్పూఫ్ లనే సినిమాగా చేసి తీసిన సుడిగాడు బ్లాక్ బస్టర్ కావడంతో.. ఆ తర్వాత వీటి డోస్ మరింతగా పెంచాడు అల్లరి నరేష్. అయితే ఇవన్నీ జనాలకు బోరు కొట్టి సినిమాలు తిప్పికొట్టడం ప్రారంభించారు.
అందుకే ఇప్పుడు తన తప్పులు తెలుసుకున్నానని చెబుతున్న ఈ అల్లరోడు.. తన కొత్త సినిమా సెల్ఫీ రాజాలో స్పూఫ్ లు లేకుండానే కామెడీ చేసినట్లు చెబుతున్నాడు. ఇందుకోసం స్క్రిప్ట్ విషయంలో చాలా కష్టపడ్డామని కూడా అంటున్నాడు. మూడేళ్ల క్రితమే రీమేక్ రైట్స్ తీసుకున్నా.. అందులో 30 శాతం స్టోరీ మాత్రమే తీసుకుని మిగతాదంతా సొంతగా రాసుకున్నారట. సెల్ఫీ రాజా కోసం 4గురు రైటర్లు స్క్రిప్ట్ పని చేశారని.. అద్భుతంగా వచ్చిన ఈ మూవీతో సక్సెస్ ఖాయంగా కొట్టేస్తాననే కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు ఈ కామెడీ హీరో.
'ఈ సినిమాని 60రోజుల్లో షూటింగ్ చేశాం. ఇందులో సగం రోజులు ఛేజింగ్ సీన్స్ నే పిక్చరైజ్ చేశాం. అలాగని ఇది యాక్షన్ పిక్చర్ కాదండీ. పూర్తిగా కామెడీ మూవీ' అంటున్న అల్లరోడి మాటలు నమ్మేట్లుగానే ఉన్నాయి. అయితే టీజర్ లో చూపించిన యాంబియన్స్.. డైలాగ్ స్పూఫ్ టైపులోనే ఉన్నాయిగా రాజా అనే కామెంట్ వినిపిస్తోంది.