Begin typing your search above and press return to search.
ముచ్చటగా మూడు సినిమాలున్నాయ్
By: Tupaki Desk | 23 Dec 2017 5:31 AM GMTటాలీవుడ్ కామెడీ హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నరేష్ విజయాన్ని చూసి చాలా కాలం అవుతోంది. ఎన్నో సినిమాలు చేస్తున్నా కూడా విజయాలను మాత్రం అందుకోవడం లేదు. చాలా మందికి ఈ ఏడాది మంచి లాభాన్ని ఇచ్చింది. కానీ అల్లరోడికి మాత్రం అస్సలు కలిసి రాలేదు. అయితే నెక్స్ట్ ఇయర్ మాత్రం ఈ ఏడాది లాగ కాకూడదని పక్క ప్రణాళికతో కెరీర్ ను సెట్ చేసుకుంటున్నాడట.
మొదట తనకు సుడిగాడు సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన భీమనేని శ్రీనివాస్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. సుడిగాడు కి సీక్వెల్ గా వస్తోన్న ఆ సినిమా కథ కూడా పూర్తయ్యింది. అంతే కాకుండా ఈ.సత్తి బాబు దర్శకత్వంలో కూడా మరొక సినిమాను చేయాలనీ ఫిక్స్ అయ్యాడు. ఆయన దర్శకత్వంలో ఇంతకుముందు నేను - యముడికి మొగుడు - బెట్టింగ్ బంగార్రాజు వంటి పలు సినిమాలను చేశాడు. అయితే చాలా రోజుల తర్వాత దర్శకుడు సరికొత్త కథతో మెప్పించడంతో మళ్లీ వారి జోడి కలవనుంది.
ఇక మరో కొత్త దర్శకుడితో కూడా నరేష్ వెరైటీ సినిమా చేయడానికి డిసైడ్ అయ్యాడు 2018 లో నరేష్ తప్పకుండా మూడు సినిమాలను రిలీజ్ చేసి వరుసగా హ్యాట్రిక్ కొట్టాలని అనుకుంటున్నాడు. అంతే కాకుండా వంశీ పైడిపల్లి - మహేష్ బాబు దర్శకత్వంలో రాబోతోన్న భారీ బడ్జెట్ సినిమాలో కూడా మనోడు ఒక స్పెషల్ క్యారెక్టర్ ని చేయబోతున్నాడు. ముచ్చటగా మూడు సినిమాలతో వస్తున్న అల్లరోడికి 2018 ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.