Begin typing your search above and press return to search.
అల్లరోడు ఆ విషయం ఒప్పుకున్నాడు
By: Tupaki Desk | 24 Dec 2015 7:30 PMఒకప్పుడు అల్లరి నరేష్ ఒకేసారి మూణ్నాలుగు సినిమాలు చేస్తుండే వాడు. మరోవైపు అతడిని దృష్టిలో ఉంచుకుని మూణ్నాలుగు కథలు తయారవుతూ ఉండేవి. ఏడాదికి మూణ్నాలుగు చొప్పున సినిమాలు విడుదలయ్యేవి. అందులో రెండు మూడు పోయినా ఒక్కటైనా కచ్చితంగా హిట్టయ్యేది. అల్లరోడి బండి సాఫీగా సాగిపోయేది. మరీ ఇబ్బందికర పరిస్థితి వస్తే నరేష్ తండ్రి ఈవీవీ సత్యనారాయణ రంగంలోకి దిగేవాడు. కొడుకును ఒడ్డున పడేసేవాడు. కానీ ఆయన వెళ్లిపోయాక నరేష్ కెరీర్ గాడి తప్పింది. రెండు మూడేళ్లుగా హిట్టు ముఖమే చూడలేక బాగా వెనకబడిపోయాడు నరేష్. ఈవీవీ లేకపోవడం నరేష్ కు ఎంత మైనస్ అవుతోంది అందరూ చెప్పడమే కానీ.. నరేష్ ఎప్పుడూ దాని గురించి స్పందించింది లేదు.
ఐతే తన 50వ సినిమా ‘మామ మంచు అల్లుడు కంచు’ విడుదల నేపథ్యంలో తండ్రి లేకపోవడం వల్ల తానెంత ఇబ్బంది పడుతోంది అంగీకరించాడు. ‘‘ఒకప్పుడు రెండు మూడు సినిమాలు తేడా కొట్టినా.. నాన్న రంగంలోకి దిగేవారు. ఒక హిట్టిచ్చి కెరీర్ బ్యాలెన్స్ చేసేవాళ్లు. ఆయన అన్ని రకాలుగా నాకు అండగా నిలిచేవారు. కథల ఎంపికలో ఆయన పాత్ర ఉండేది. తప్పొప్పులు చెప్పేవారు. ఐతే తుది నిర్ణయం మాత్రం నన్నే తీసుకోమనేవారు. ఓ దశలో వరుసగా ఫ్లాపులు ఎదురైనపుడు ‘కితకితలు’ నా కెరీర్ ను నిలబెట్టింది. ఐతే ఇప్పుడు చిన్న నిర్మాతలు, దర్శకులు బాధ్యతల్ని సరిగా నిర్వర్తించలేకపోతుండటంతో నా మీద భారం పెరుగుతోంది’’ అని చెప్పాడు నరేష్. ‘మామ మంచు అల్లుడు కంచు’తో మళ్లీ పెద్ద హిట్టు కొడతానని.. ఒకప్పటిలాగే వేగంగా సినిమాలు చేస్తానని అల్లరోడు తెలిపాడు.