Begin typing your search above and press return to search.
అల్లరోడు బతికిపోయేట్లే ఉన్నాడు
By: Tupaki Desk | 18 July 2016 11:00 AM GMTఅల్లరి నరేష్ గత సినిమాలు మామ మంచు అల్లుడు కంచు.. జంప్ జిలాని కనీస ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయాయి. ఐతే వాటితో పోలిస్తే మరింతగా నెగెటివ్ టాక్ తో మొదలైనప్పటికీ ‘సెల్ఫీ రాజా’కు మాత్రం వసూళ్లు బాగానే ఉన్నాయి. ప్రమోషన్ బాగా చేసి ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయడం.. పోటీ లేకపోవడం.. ఇందులోని స్పూఫ్ కామెడీ మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తుండటం వల్ల ‘సెల్ఫీ రాజా’కు ఆరంభ వసూళ్లు బాగానే ఉన్నాయి.
తొలి వారాంతంలో ఈ సినిమా రూ.2.8 కోట్ల దాకా షేర్ రాబట్టింది. అల్లరోడు ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం చూస్తే ఇది పెద్ద ఫిగరే. ఒక్క నైజాం ఏరియాలో రూ.1.3 కోట్ల దాకా వసూలు చేసిన సెల్ఫీ రాజా.. దాదాపుగా బ్రేక్ ఈవెన్ కు వచ్చేసింది. ఈ చిత్రానికి రూ.4 కోట్ల దాకా బిజినెస్ జరిగింది. ఈ శుక్రవారం ‘కబాలి’ వచ్చే లోపు ఇంకో కోటి రూపాయలు రాబట్టగలిగితే బయ్యర్లందరూ సేఫ్ అయిపోతారు. మరి ఈ నాలుగు రోజుల్లో అల్లరోడు ఏమాత్రం సత్తా చూపుతాడో చూడాలి.
అల్లరి నరేష్ సినమా ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’తోనే దర్శకుడిగా పరిచయమైన ఈశ్వర్ రెడ్డి తీసిన సినిమా ‘సెల్ఫీ రాజా’. చలసాని రామబ్రహ్మం చౌదరి నిర్మాత. సాక్షి చౌదరి.. కామ్న సింగ్ కథానాయికలుగా నటించారు. ‘సుడిగాడు’ తరహాలో ఈ సినిమాలోనూ బోలెడన్ని స్పూఫ్ లతో నింపేశారు. పృథ్వీ.. సప్తగిరి.. తాగుబోతు రమేష్ సహా చాలామంది కమెడియన్లున్నారు ఈ సినిమాలు. వాళ్ల అండతో అల్లరోడు ఎప్పుడూ చేసే పేరడీలు.. స్పూఫులే చేశాడిందులో.