Begin typing your search above and press return to search.

నా ఉగ్రరూపం ఏంటో చూస్తారన్న నరేష్..!

By:  Tupaki Desk   |   2 May 2023 9:35 AM GMT
నా ఉగ్రరూపం ఏంటో చూస్తారన్న నరేష్..!
X
ఈవీవీ తనయుడిగా అల్లరి సినిమాతో తెరకు పరిచయమైన నరేష్ తన మొదటి సినిమానే తన ఇంటి పేరుగా అదే స్క్రీన్ నేమ్ గా మార్చేసుకున్నాడు. కెరీర్ లో ఎక్కువ శాతం కామెడీ సినిమాలు చేస్తూ వచ్చిన అల్లరి నరేష్ నాంది నుంచి తన పంథా మార్చాడు. తన నుంచి ఆడియన్స్ ఇంకా ఏదో ఆశిస్తున్నారని తెలుసుకున్న నరేష్ నాందితో సీరియస్ అటెంప్ట్ చేసి హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు అదే కాంబోలో ఉగ్రం తో రాబోతున్నారు. ఉగ్రం సినిమాను విజయ్ కనకమేడల డైరెక్షన్ లో తెరకెక్కింది. షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు.

మే 5న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి గెస్ట్ లుగా డైరెక్టర్ హరీష్ శంకర్, అనీల్ రావిపుడి రాగా.. యువ హీరోలు విశ్వక్ సేన్, సందీప్ కిషన్, నిఖిల్, అడివి శేష్ లు కూడా అటెండ్ అయ్యారు. ఇక ఈవెంట్ లో చివరగా మాట్లాడిన అల్లరి నరేష్ సినిమాపై తన నమ్మకాన్ని బలంగా చెప్పారు. తన ఈవెంట్ కి హీరోలు వీళ్లంతా వస్తున్నారని నాకు చెప్పలేదని అన్నారు నరేష్.

మే డే సందర్భంగా 60 సినిమాలు తనతో పనిచేసిన దర్శకులకు టెక్నిషియన్స్ కి థాంక్స్ అని చెప్పారు నరేష్. ఇక డైరెక్టర్ విజయ్ కి ప్యాకప్ అనే వర్డ్ హరీష్ శంకర్ నేర్పించలేదనుకుంటా నాంది తో కలిసి పనిచేశాం ఆ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు.

ఆ సినిమాతో మేమిద్దరం ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నాం మళ్లీ ఉగ్రం తీశాం.. ఈ సినిమా భారీ అంచనాలతో వస్తుందని అన్నారు. అంతేకాదు నాందికి పనిచేసిన టీం అంతా ఈ సినిమాకు పంచేసిందని చెప్పారు.

ఈ సినిమాకే కాదు విజయ్ తో ఈ టీం అంతా ఇలానే ఉండాలని అన్నారు నరేష్. విజయ్ తో 3వ సినిమా కూడా ఉండాలని కోరుతున్నా కాకపోతే తన కమిట్మెంట్స్, నా సినిమాలు పూర్తయ్యాక కలిసి చేస్తామని అన్నారు. డైరెక్టర్ విజయ్ తో తనకు బాగా సింక్ కుదిరిందని అన్నారు నరేష్.

అయితే సినిమా గురించి ఇప్పుడు చాలా తక్కువ మాట్లాడతా.. రిలీజ్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆరోజు నేనే ముందు అన్నీ మాట్లాడతా అన్నారు నరేష్. నిర్మాతలు ఖర్చుకి ఎక్కడ వెనకడుగు వేయలేదు. సినిమా పబ్లిసిటీ కూడా బాగా చేస్తున్నారని అన్నారు. సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి థ్యాంక్స్ చెప్పారు నరేష్.

ఇన్నాళ్లు నేను కామెడీ ఫైట్స్ చేస్తే చూశారు ఈ సినిమాలో సీరియస్ ఫైట్స్ చేశా.. కితకితలు పెట్టించా.. కొన్ని సినిమాలు కంటతడి పెట్టించా.. ఈ సినిమాతో నా ఉగ్రరూపం చూస్తారని చెప్పారు నరేష్. అల్లరోడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఉగ్రం తో నాందిని మించే హిట్ అందుకునేలా ఉన్నాడని అనిపిస్తుంది.