Begin typing your search above and press return to search.
అల్లరోడు సీరియస్ యాంగిల్ లోనే!
By: Tupaki Desk | 1 May 2019 4:35 PM GMTమహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ నేటి సాయంత్రం పీపుల్స్ ప్లాజాలో మహేష్ అభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. మహేష్ కెరీర్ 25వ చిత్రం కావడంతో ఈ వేడుకకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. సుమారు 20 -30 వేల మంది అభిమానులు తరలి రావడంతో వేదిక కిక్కిరిసిపోయిందని తెలుస్తోంది. ఇక ఈ ఈవెంట్ లో అతిరధుల మధ్య అల్లరి నరేష్ ఎంతో ఉద్వేగంగానే మాట్లాడారు. గత కొంతకాలంగా మహర్షి చిత్రంలో అల్లరి నరేష్ ఎలా కనిపించబోతున్నారు? అంటూ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. అందుకే ఈ విషయంలో ఎంతో ఎగ్జయిట్ అవుతూ కనిపించారు నరేష్.
వేదికపై అల్లరి నరేష్ అనవసర ఆర్బాటం లేకుండా సింపుల్ స్పీచ్ తో ఆకట్టుకున్నాడు. తన పాత్ర గురించి అస్సలు రివీల్ చేయనేలేదు. ``మహేష్ 25వ సినిమా మహర్షి తప్పకుండ బ్లాక్ బస్టర్ హిట్టవుతుంది. నన్ను కామెడీ యాంగిల్ లోనే కాకుండా కొంచెం సీరియస్ యాంగిల్ లో కూడా చూపించారు. ఇంత మంచి క్యారెక్టర్ కోసం నన్ను నమ్మినందుకు డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారికి కృతజ్ఞతలు`` అని అన్నారు. ఇతర సంగతులన్నీ సక్సెస్ మీట్ లో చెబుతానని అన్నారు.
ఇంతటి భారీ ప్రతిష్టాత్మక వేడుకలో పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మహేష్ బాబు 25వ చిత్రంలో నటించడం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. నిర్మాతలు ముగ్గురి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పుడే సినిమా గురించి ఏమీ చెప్పలేనని అన్నారు. నరేష్ చెప్పిన దానిని బట్టి అతడి పాత్రలో కామెడీ కంటే సీరియస్ నెస్.. ఎమోషన్ దాగి ఉంటుందని .. ఫ్రెండ్షిప్ కి సంబంధించిన కీలక మైన ట్విస్ట్ కోసం ఆ పాత్రను రూపొందించారని అర్థమవుతోంది.