Begin typing your search above and press return to search.
అల్లరోడు తెలుసుకున్నాడా మరి?
By: Tupaki Desk | 24 Nov 2017 10:00 AM GMTటాలీవుడ్ లో ఒకప్పుడు నిర్మాతలకి మినిమమ్ గ్యారెంటీ హోరోగా ఉన్న అల్లరి నరేష్ ఇప్పుడు ఏ మాత్రం హిట్స్ అందుకోవడం లేదు. ఒక్క కామెడీ తరహా పాత్రలనే కాకుండా కొన్ని ప్రయోగాలను కూడా చేసి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. ముఖ్యంగా సుడిగాడు సినిమాతో మొదటిసారి బాక్స్ ఆఫీస్ హిట్ ను రుచి చూసి తన మార్కెట్ ని పెంచేసుకున్నాడు. కానీ ఆ తర్వాత తీసిన సినిమాలు మాత్రం సుడిగాడు స్థాయిలో ఆడలేదు.
వరుస పరాజయాలు అల్లరోడిని చాలా కలవరపెట్టాయి. అయితే కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమాకు సీక్వెల్ ద్వారా వచ్చి మళ్లీ గాడిలో పడాలని చుస్తున్నాడు. సుడిగాడు సినిమాను తమిళ్ 'తమిజ్ పదం' అనే సినిమాకు రీమేక్ గా తీశారు. అయితే ఇప్పుడు అదే చిత్ర బృందం 'తమిజ్ పదం 2' సినిమాను తెరకెక్కిస్తుండడంతో సుడిగాడు దర్శకుడు భీమనేని శ్రీనివాస్ కూడా మళ్లీ అల్లరి నరేష్ తో సీక్వెల్ ని తెరకెక్కించాలని చూస్తున్నాడు. ఇదంతా తెలిసిన విషయమే. ఇక్కడే మరో విషయం ఆలోచిద్దాం.
ఈ మధ్యన నరేష్ ఒరు వడక్కన్ సెల్ఫీ వంటి సినిమాను మేడ మీద అబ్బాయి అంటూ తీశాడు. కాని సినిమా డిజాష్టర్ అయ్యింది. ఎందుకమంటే మన దగ్గర జబర్దస్త్ వంటి టివి షో ల పుణ్యమా అంటూ.. ఇప్పుడు కామెడీకి కొదవలేదు. పైగా పొట్ట చెక్కలయ్యే రేంజులో వారు ఉత్తినే నవ్వించేస్తున్నారు. కాబట్టి సినిమాల్లో కేవలం కామెడీ కాకుండా ఇంకేదైనా ఉంటేనే జనాలు చూస్తారు. ఈ విషయం అల్లరోడు తెలుసుకున్నాడా మరి?