Begin typing your search above and press return to search.

NBK 106 లో అల్ల‌రోడు ఫైన‌ల్ అయిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   14 Sep 2020 3:30 AM GMT
NBK 106 లో అల్ల‌రోడు ఫైన‌ల్ అయిన‌ట్టేనా?
X
టాలీవుడ్ లోనే అత్యంత వేగంగా 50 సినిమాలు పూర్తి చేసిన హీరోగా అల్ల‌రి న‌రేష్ పేరు మార్మోగింది. అయితే ఇటీవ‌ల న‌రేష్ కెరీర్ ఆశించినంత జెట్ స్పీడ్ తో సాగ‌లేదు. స‌రైన విజ‌యాల్లేక సోలో హీరోగా అవ‌కాశాలు త‌గ్గాయి. ఆ క్ర‌మంలోనే స్టార్ హీరోల సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తూ మ‌ల్టీస్టార‌ర్ల‌తో బిజీ అయిపోతున్నాడు.

ఇదివ‌ర‌కూ మ‌హేష్ న‌టించిన `మ‌హ‌ర్షి` చిత్రంలో అల్ల‌రి న‌రేష్ న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది. ఇప్పుడు ఇంచుమించు అలాంటి అవ‌కాశ‌మే న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ మూవీ NBK 106 (బీబీ3) కోసం ఆఫ‌ర్ చేశార‌ని తెలుస్తోంది. బాల‌య్య‌- బోయ‌పాటి కాంబినేష‌న్ మూవీ లాక్ డౌన్ గ్యాప్ త‌ర్వాత‌.. అక్టోబ‌ర్ నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుంద‌ని స‌మాచారం. ఇక ఈ మూవీలో ఫ్లాష్ ‌బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే కీలకమైన పాత్రలో న‌టించే హీరో కోసం బోయ‌పాటి చాలా కాలంగా వెతుకుతున్నారు.

ఇదివ‌ర‌కూ నవీన్ చంద్ర.. క‌ళ్యాణ్ రామ్ త‌దిత‌ర హీరోల పేర్లు వినిపించినా ఏవీ ఖ‌రారు కాలేదు. ప్ర‌స్తుతం అల్ల‌రి న‌రేష్ ని సంప్ర‌దించార‌న్న టాక్ ఫిలింస‌ర్కిల్స్ లో వినిపిస్తోంది. న‌రేష్ అంగీకరించారా లేదా? అన్న‌ది తెలియాల్సి ఉంది. క‌థానాయిక‌ల వివ‌రాల్ని ప్ర‌క‌టిస్తారేమో చూడాలి. ద‌స‌రా నాటికి టైటిల్ ని ప్ర‌క‌టించాల‌న్న‌ది ప్లాన్. ఈ చిత్రానికి ఎస్.ఎస్.థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. 2021 వేస‌వి విడుదలకు సిద్ధం చేయాల‌న్న క‌సితో బోయ‌పాటి వేగంగా పూర్తి చేయ‌నున్నార‌ట‌.