Begin typing your search above and press return to search.

అల్లరోడి భార్యకు నచ్చిన హీరో ఎవరు?

By:  Tupaki Desk   |   3 July 2017 7:37 AM GMT
అల్లరోడి భార్యకు నచ్చిన హీరో ఎవరు?
X
హీరోల భార్యల్లో ఎవరినైనా మీకు నచ్చిన హీరో ఎవరు అంటే చాలామంది తమ భర్తే అని చెబుతారు. ఐతే అల్లరి నరేష్ భార్య విరూప మాత్రం తనకు నచ్చిన హీరో నరేష్ కాదంటోంది. ఆమెకు నచ్చిన హీరో అసలు టాలీవుడ్లోనే లేడు. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ అంటే విరూపకు చాలా ఇష్టమట. విరూప స్వస్థలం చెన్నై అన్న సంగతి తెలిసిందే.

చెన్నైకి చెందిన తెలుగు కుటుంబానికి చెందిన విరూప.. అక్కడే పుట్టి పెరిగింది. తమిళ సినిమాలు చూస్తూ పెరిగిన ఆమెకు అజిత్ అంటే పిచ్చి అభిమానమట. నరేష్ ను పెళ్లాడినప్పటికీ విరూప తన అభిరుచి ఏమీ మార్చుకోలేదు. ఇప్పటికీ ఆమె అభిమాన హీరో అజితేనట. ఐతే అల్లరి నరేష్ కామెడీ సినిమాలంటే విరూపకు ముందు నుంచి ఇష్టమట. విరూపను నరేష్ రెండేళ్ల కిందట పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరికీ ఓ పాప కూడా పుట్టింది. ఆ పాప పేరు అయాన ఇవిక ఈదర. ఈ ఆదివారమే నరేష్ 35వ పుట్టిన రోజు జరుపుకున్నాడు.

ఐదేళ్లుగా హిట్టు ముఖం చూడని నరేష్.. గత ఏడాది ‘ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం’తో మరో ఫ్లాప్ ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం అతడి ఆశలన్నీ ‘మేడ మీద అబ్బాయి’ మీదే పెట్టుకున్నాడు. ఇది మలయాళంలో హిట్టయిన ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’కి రీమేక్. మలయాళ వెర్షన్ కు దర్శకత్వం వహించిన ప్రజీషే తెలుగు వెర్షన్ కూడా డైరెక్ట్ చేస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/