Begin typing your search above and press return to search.
మహేష్ కోసం జిమ్ లో నరేష్
By: Tupaki Desk | 18 Dec 2017 11:46 AM GMTటాలీవుడ్ లో మన హీరోల ఆకృతి ఎలా ఉన్నా కూడా అభిమానులకు బాగా నచ్చుతారు. ఒక్కొక్కరికి ఒక్కో తరహా స్టైల్ ఉంది. అయితే చాలా మంది హీరోలకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. కానీ కామెడీ కథలను ఎక్కువగా చేసే అల్లరి నరేష్ కు మాత్రం అస్సలు లిమిట్స్ ఉండవనే చెప్పాలి. తన కామెడీ టైమింగ్ తో దాదాపు 15 ఏళ్లుగా కెరీర్ ను ఒకే లెవెల్ లో మెయింటేన్ చేస్తున్నాడు. అయితే సుడిగాడు సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నరేష్ మళ్లీ ఆ లెవెల్లో హిట్ అందుకోలేదు.
అప్పటి నుంచి చాలా ప్రయోగాలు చేశాడు. హారర్ కథలను ఇతర భాషల హిట్ సినిమా కథలను కూడా ట్రై చేశాడు గాని హిట్టు మాత్రం అందడం లేదు. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలని సుడిగాడు కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నాడు. భీమనేని శ్రీనివాస్ తోనే సినిమాకు సీక్వెల్ చేసే పనిలో పడ్డాడు. ఆ సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే మరో స్పెషల్ ఏమిటంటే ఈ కామెడీ హీరో గత కొంత కాలం నుంచి మహేష్ 25వ సినిమాలో ఒక స్పెషల్ రోల్ చేస్తున్నాడు అనే టాక్ బాగా వినిపిస్తోంది. అయితే ఫైనల్ గా ఆ రోల్ ఫిక్స్ అయినట్లు సమాచారం.
అంతేకాకుండా .. అందుకోసం జిమ్ లో అల్లరోడు కసరత్తులు చేస్తున్నాడట. దర్శకుడు వంశీ పైడిపల్లి క్యారెక్టర్ గురించి వివరించి కొంచెం కండలను పెంచి లావుగా ఫిట్ గా కనిపించమని అడగడంతో మనోడు ఎప్పుడు లేని విధంగా డైట్ ఫాలో అవుతున్నాడట. నెక్స్ట్ ఇయర్ ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. దిల్ రాజు అండ్ అశ్విని దత్త్ ఆ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నారు.