Begin typing your search above and press return to search.
MAA కి కాకుండా మోహన్ బాబుకు డబ్బు కడతారా?
By: Tupaki Desk | 5 Oct 2021 8:35 AM GMT`మా` ఎన్నికల పర్వం అపహాస్యంగా మారుతోందా?.. సభ్యుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఓటింగ్ ని ప్లాన్ చేస్తూ కొత్త ఒరవడికి మంచు విష్ణు ప్యానెల్ ప్రయత్నాలు చేస్తోందా? అంటే ప్రకాష్ రాజ్ తాజా ఆరోపణలు బలాన్ని చేకూరుస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతోందని,... మరీ ఇంతగా దిగజారుడు తనమా? అని ప్రకాష్ రాజ్ తన ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ ని కూడా దుర్వినియోగం చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.
మంగళవారం ఈ విషయమై తన ప్యానెల్ సభ్యులతో కలిసి ఈసీని కలిసిన ప్రకాష్ రాజ్ మరీ ఇంతగా దిగజారి ఎన్నికల్లో గెలవాలని చూడటం ఆవేదన కలిగిస్తోందన్నారు. కృష్ణంరాజు.. పరుచూరి బ్రదర్స్.. శారద.. లక్ష్మీ గార్లతో పాటు చెన్నైలో వున్న పలువురు ఆర్టిస్ట్ లకు సంబందించిన ఫీజ్లని కూడా వారే కట్టేసి బ్యాలెట్ పేపర్ ల కోసం సభ్యులే రాసినట్టుగా ఒకే విధంగా లెటర్ లు రాశారని ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. గెలిసే ముందు ఇలా మీరే గుద్దించుకుంటారా? .. 28 వేలు కంటెస్టెంట్ సభ్యుల కోసం ఈసీలో ఎలా కడతారండీ? .. శరత్ బాబుగారికి ఫోన్ చేస్తే వాళ్లు కట్టివుంటారు.. నేను మోహన్ బాబుకు గూగుల్ పే చేస్తానన్నారు.
ఇదేనా `మా ` అసోసియేషన్ అంటే? .. సభ్యులు అసోసియేషన్ కి డబ్బు కట్టకుండా మోహన్ బాబుకు కడతారా? ఇదేనా పద్దతి?.. ఈ సందర్భంగా మురళీమోహన్.. నాగార్జున.. చిరంజీవి గార్లని అడుగుతున్నాను.. ఇదేనా పద్దతి? .. నాకు సమాధానం చెప్పండి? .. విష్ణు ప్యానెల్ ఇలా నిబంధనల్ని ఉల్లంఘిస్తోంది. అంతా కళామతల్లి బిడ్డలు అంటారు.. అరవై ఏళ్లు నిండిన వారిని కౌగిలించుకుని వారిని ఆదుకుందామని ఎలక్షన్స్ కి వస్తే వారిని కూడా ఇలా వాడుకుంటారా? .. అడ్డదారిలో గెలిచేందుకు మరీ ఇంతకు దిగజారుతారా? అని ప్రకాష్ రాజ్ తన ఆవేదనని వ్యక్తం చేశారు. శ్రీకాంత్ మాత్రం ఇక పోటీ చేయడం అనవసరం.. పోటీ నుంచి తప్పుకోవడమే మంచిదని ఆవేదనని .. ఆక్రోశాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.