Begin typing your search above and press return to search.

శ‌త్రుఘ్న సిన్హా కుటుంబంపై న‌టి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

By:  Tupaki Desk   |   6 May 2022 8:30 AM GMT
శ‌త్రుఘ్న సిన్హా కుటుంబంపై న‌టి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు
X
బాలీవుడ్ లెజెండ‌రీ న‌టుడు..ప్ర‌ముఖ రాజకీయవేత్త శ‌త్రుఘ్న సిన్హా కుటుంబంపై న‌టి పూజా మిశ్రా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఓ ఇంట‌ర్వ్యూ వేదిక‌గా లెజెండ‌రీ ఫ్యామిలీపై నిప్పులు చెరిగిన ఘ‌ట‌న సోష‌ల్ మీడియా అంత‌టా హాట్ టాపిక్ గా మారింది. పూజా మిశ్రా మాట్లాడుతూ...

``సిన్హా కుటుంబం 17 ఏళ్లుగా న‌న్ను వేధిస్తుంది. న‌టిగా ఎదుగుతోన్న క్ర‌మంలో సెక్స్ వ‌ర్క‌ర్ గా మార్చేసారు. నాపై క్షుద్ర పూజ‌లు చేయించి శృంగార ప‌నుల‌కు బానిస అయ్యేలా త‌యారు చేసారు. అటుపై వ్య‌భిచార రాకెట్ ముఠాలోకి నెట్టారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా సిన్హా కుటుంబం చేసింది. మానాన్న‌..శ‌త్రుఘ్న సిన్హా చిన్న నాటి నుంచి స్నేహితులు. నాన్న సిన్హా కుటుంబానికి కోట్ల‌లో అప్పులిచ్చారు. ఆ విశ్వాసం కూడా లేకుండా న‌న్ను ఆ కుటుంబ అన్ని ర‌కాలుగా వాడుకుంది. శ‌త్రుఘ్న సిన్హా..అత‌ని భార్య పూన‌మ్ సిన్హా కీలు బొమ్మ‌లా చేసి ఆడుకున్నారు` అని ఆరోపించారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ... ``నా ఎదుగుద‌ల‌ని చూసి ఓర్వ‌లేక‌పోయారు. ఒక రోజు శ‌త్రుఘ్న సిన్హాకి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్ప‌డానికి ఇంటికి వెళ్తే పూన‌మ్ చేత‌బ‌డి చేయించిన తినుబండారాలు తినిపించింది. త‌ర్వాత నా శ‌రీరం అదుపు త‌ప్పింది. ఇలా ప్ర‌తీసారి నాపై `బ్లాక్ మ్యాజిక్` ప్ర‌యోగించి సెక్స్ లో పాల్గొనేలా చేసారు.

నా క‌న్యాత్యాన్ని అమ్మి ఫ్యాష‌న్ డిజైన‌ర్ గానే ఉండిపోవాల్సిన త‌న కుమార్తె సోనాక్షి సిన్హాని హీరోయిన్ ని చేసారు. పూన‌మ్ మ‌హాన‌టి. బాలీవుడ్ లో వేశ్య‌లు మాత్ర‌మే ప‌నిచేస్తార‌ని నాన్న ద‌గ్గ‌ర అనేది. ఆ కార‌ణంగానే సినిమాల్లోకి తాను అడుగుపెట్ట‌లేద‌ని అనేది. మరి ఇప్పుడెందుకు త‌న కుమార్తె సోనాక్షిని హీరోయిన్ ని చేసిన‌ట్లు? ఆ కుటుంబ చేసిన ప‌నుల‌కే నాకింకా పెళ్లి కాలేదు. నా జీవితాన్ని ఆ కుటుంబం స‌ర్వ‌నాశనం చేసింద‌ని సిన్హా కుటుంపై మండిప‌డింది. మ‌రి ఈ ఆరోప‌ణ‌ల‌పై శ‌త్రుఘ్న సిన్హా కుటుంబం ఎలా రియాక్ట్ అవుతుంద‌న్న‌ది చూడాలి.

పూజా మిశ్రా విష‌యానికి వ‌స్తే `బిగ్ బాస్ -5`వ సీజ‌న్ తో బాలీవుడ్ లో పాపుల‌ర్ అయింది. ఆమె బాలీవుడ్ లో కాంట్ర‌వ‌ర్శీ క్వీన్ గా పేరుంది. ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌డం ఆమెకి కొత్తేం కాదు. ఆమెపై ప‌లు పోలీస్ కేసులు సైతం ఉన్నాయి. బాలీవుడ్ లో పేరున్న వ్య‌క్తుల‌పై ఇలాంటి ఆరోప‌ణ‌లు చేసి మీడియా అటెన్ష‌న్ డ్రా చేస్తుంద‌ని పలు మీడియా సంస్థ‌లు పేర్కొంటున్నాయి. కేవ‌లం ప‌బ్లిసిటీ కోస‌మే ఇలాంటి అర్ధం లేని ఆరోప‌ణ‌లు చేస్తుంద‌ని రాసుకొస్తున్నాయి.