Begin typing your search above and press return to search.
‘‘లైకా’’ మీద తమిళ మీడియాలో గోల గోల
By: Tupaki Desk | 23 Jun 2016 4:18 AM GMTతమిళ టాప్ హీరోలు రజనీకాంత్.. కమల్ హాసన్.. విజయ్ లతో చిత్రాలు నిర్మిస్తున్న లైకా సంస్థ మీద తమిళనాడు మీడియాలో వస్తున్న వార్తలు ఇప్పుడు గందరగోళంగా మారాయి. ప్రస్తుతం ఆ సంస్థ రజనీకాంత్ తో 2.0 - కమల్ హాసన్ తో శభాష్ నాయుడు చిత్రాల్ని నిర్మిస్తోంది. ఈ సంస్థ ఆర్థిక నేరాలకు పాల్పడిందని.. ఆక్రమంగా విదేశాలకు భారీ మొత్తాన్ని పంపినట్లుగా వస్తున్న వార్తలు ఇప్పుడు గందరగోళంగా మారాయి. అయితే.. ఇలాంటి వార్తల్లో నిజం లేదని.. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని సదరు సంస్థ పేర్కొంటోంది.
ఈ సంస్థ మీద తమిళ మీడియాలో వస్తున్న వార్తల్ని చూస్తే.. పోస్టల్ శాఖ ద్వారా అక్రమంగా రూ.129 కోట్లను విదేశాలకు పంపినట్లుగా చెబుతున్నారు. ఈ సంస్థపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థ శ్రీలంక కేంద్రంగా టెలికాం వ్యాపారాల్ని చేస్తుందని.. ఈ సంస్థ యజమాని అలీరాజా సుభాష్ కరణ్ కు బ్రిటన్.. ఫ్రాన్స్ లలో సిమ్ కార్డు వ్యాపారాలు ఉన్నట్లు చెబుతారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు 60 కార్యాలయాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కోట్లాది రూపాయాల్ని విదేశాలకు తరలిస్తున్న కేసులో ఈ సంస్థ ప్రధాన నిర్వాహకుడితో సహా 19 మందిని ఫ్రాన్స్ ఫోలీసులు అరెస్ట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ వాదనల్ని సంస్థ ఖండిస్తోంది. తాజాగా వస్తున్న వార్తలు.. తమిళ చిత్ర పరిశ్రమలో గందరగోళానికి గురి చేస్తోంది.