Begin typing your search above and press return to search.
కామెంట్: నితిన్ రిలీజ్ డేట్ నచ్చలేదు
By: Tupaki Desk | 26 May 2016 4:51 AM GMTపవర్ ఆఫ్ సోషల్ నెట్వర్క్ అనేది ఇప్పుడు పీక్స్ కు వెళ్లిపోయింది. ఒకప్పుడు ఉదయాన్నే ఈనాడు పేపర్ లో వచ్చిందే న్యూస్. దాని గురించి పొద్దున్నే కాకా హోటల్ దగ్గర టీ త్రాగుతూ నాలుగు మాటలు విసురుకుంటే.. అదే డిస్కషన్. ఎవరి భావాలు వారు పోస్టింగ్ చేసి.. ఆ పక్కనున్న ఇద్దరు ముగ్గురు వాటిని లైక్ చేసో అన్ లైక్ చేసో వెళ్లిపోయావారు. ఇప్పుడు సీన్ మారింది. నచ్చకపోతే ఆ క్లిప్పింగ్ ను కట్ చేసి మరీ ఫేస్ బుక్ గోడపై పెట్టి.. దాని మీద చర్చలు.. ఫైట్లు.. తిట్లు.. శాపనార్ధాలు.. చక్కగా హిస్టరీలో నిలిచిపోయేలా మనోళ్ళు పిచ్చెక్కిస్తున్నారు.
ఆల్రెడీ మొన్నామధ్యన సర్ధార్ ఫ్లాప్ తరువాత జరిగిన ట్రాలింగ్.. ఇక బ్రహ్మోత్సవం డిజాష్టర్ షో పై పేలిన స్పూఫులు.. అలాగే రామ్ గోపాల్ వర్మ ట్వీట్ల మీద జరిగే రచ్చ.. మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు హీరో నితిన్ కూడా ఇలాంటి ఒక కాంట్రోవర్సీలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాడు. అసలు ''అ..ఆ'' సినిమాను జూన్ 2న రిలీజ్ చేస్తున్నారు కాబట్టి.. దానిని ఆంధ్రలో ఫిలిం లవర్స్ ఎవాయిడ్ చేయాలి అంటున్నారు సమైక్యాంధ్రవాదులు. సరిగ్గా తెలంగాణ ఫార్మేషన్ డే నాడు రిలీజ్ అంటే.. అది ఆంధ్రకు అన్యాయం జరిగిన రోజున రిలీజ్ చేయడమే కదా అనేది వీరి వాదన. ఫేస్ బుక్కులో ఆల్రెడీ ఈ విషయమై పెద్ద క్యాంపెయినే నడుస్తోంది.
ఇక సినిమాలను ప్రేమించే సామాన్య జనాలకు మాత్రం.. ఇలాంటివన్నీ పడతాయా? 70 పెట్టి టిక్కెట్ కొన్నామా.. సినిమా చూశామా అనేది వీరి సింగిల్ పాయింట్ ఎజెండా. అది సంగతి.