Begin typing your search above and press return to search.
అనుష్క డెలివరీ ఆస్ట్రేలియాలో అవుతుందనుకున్నాం..! కోహ్లి ఏంటిలా చేశాడు?
By: Tupaki Desk | 21 Nov 2020 11:30 PM GMT‘ కోహ్లి సూపర్బ్ బ్యాట్స్‌మెన్. అతడి బ్యాటింగ్ అంటే ఎంతో ఇష్టం. ఇంత డెడికేషన్ ఉన్న బ్యాట్స్‌మెన్‌ను నేను ఇంతవరకు చూడలేదు. కోహ్లికి నేను వీరాభిమానిని. నిజానికి కోహ్లీ ఆస్ట్రేలియాతో అన్ని మ్యాచ్‌లు ఆడతాడనుకున్నా. అనుష్క కూడా ఆస్ట్రేలియాలోనే డెలివరీ చేయించుకుంటుందేమో అనుకున్నా. కానీ కోహ్లీ అన్ని మ్యాచ్ లు ఆడకుండానే ఇండియాకు వెళ్లిపోతున్నాడు. ఇది నిజంగా టీంఇండియాకు ఎంతో నష్టం’ అంటూ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అలెన్ బోర్డర్ పేర్కొన్నారు.
నవంబరు 27 నుంచి కంగారూలతో వరుసగా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల సిరీస్‌ని భారత్ ఆడనుండగా.. తొలి టెస్టు ముగిసిన వెంటనే భారత్‌కి కోహ్లీ వచ్చేయనున్నాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఆస్ట్రేలియాలో ప్రసవిస్తుందని, దీంతో కోహ్లీ సంతానాన్ని తమ దేశానికి చెందినవారిగా పరిగణించవచ్చని ఆశించామని ఓ వర్చువల్ మీడియా సమావేశంలో అలెన్ బోర్డర్ సరదాగా వ్యాఖ్యానించాడు. డిసెంబరు 17 నుంచి 21 వరకూ అడిలైడ్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే భారత్‌కి కోహ్లీ వచ్చేయనున్నాడు. చివరి మూడు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరం కానుండడంతో.. అతని స్థానంలో అజింక్య రహానె మూడు టెస్టుల్లోనూ కెప్టెన్‌గా టీమిండియాని నడిపించబోతున్నాడు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. బయో-సెక్యూర్ బబుల్‌లో ఈ సిరీస్‌ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిర్వహిస్తుంది. కోహ్లి ఆడకపోవడం ఆస్ట్రేలియాకు ఎంతో లాభమని బోర్డర్ వ్యాఖ్యానించారు. ఈ టెస్ట్ సీరిస్‌లో ఆస్ట్రేలియా సులభంగానే గెలుస్తుందన్నారు. టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1తో గెలుస్తుందని భావిస్తున్నా' అని అలెన్ బోర్డర్ జోస్యం చెప్పాడు.