Begin typing your search above and press return to search.
బ్రూస్ లీ.. పబ్లిసిటీ స్టంటులా ఉందే
By: Tupaki Desk | 30 Oct 2015 7:30 PM GMTఅసలే లేని పోని వివాదాలతో సతమతమవుతున్నాడు శ్రీను వైట్ల. బ్రూస్ లీ విషయంలో అందరూ అతణ్నే నిందిస్తున్నారు. పైగా భార్య రూప తనపై పెట్టిన కేసు గురించి గొడవ నడుస్తోంది. ఇలాంటి తరుణంలో కొత్తగా కోన వెంకట్ అతడిపై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేయబోతున్నాడన్న వార్త ఒకటి. మొదట ఇది రూమర్ అనుకున్నారు కానీ.. కచ్చితంగా పది కోట్లకు దావా అని, తాను రాసిన కథను వైట్ల మార్చేసి కథకుడిగా తనకు క్రెడిట్ ఇవ్వడం పట్ల కోన అవమానంగా భావించి దావా వేయడం కోసం లాయర్ని సంప్రదిస్తున్నాడని ఏదో ప్రెస్ నోట్ ఇచ్చినట్లు అన్ని మీడియాల్లోనూ వార్తలు వచ్చేసరికి ఇది నిజమే అని నమ్మారందరూ.
ఐతే కోన వెంకట్ ఈ దావా ప్రస్తావన తేకుండా.. ‘బ్రూస్ లీ’ విషయంలో వస్తున్న రూమర్లు నమ్మొద్దని, సినిమా ఇరగాడేస్తోందని ట్వీట్ పెట్టడంతో దావా వార్తలు కొంచెం సద్దుమణిగాయి. సినిమా వాళ్ల గురించి రూమర్లు మామూలే కానీ.. అవి ఫలానా వాళ్ల మధ్య విభేదాలట అని వస్తాయి కానీ.. పది కోట్ల రూపాయలకు దావా అని ఎందుకొస్తాయి. ఇలాంటి గాలి వార్త ఇంతకముందెప్పుడైనా విన్నామా? ఇది చాలా స్ట్రేంజ్ గా అనిపించట్లేదూ. ఏమీ ఆధారం లేకుండా ఇలాంటి రూమర్లు పుడతాయా? చూస్తుంటే ఊరికే పబ్లిసిటీ కోసం కావాలనే ఈ వార్త పుట్టించినట్లుగా లేదూ? సినిమా చాలా బాగా ఆడేస్తోందని నొక్కి చెబుతుండటాన్ని బట్టి ఇది కచ్చితంగా కావాలని, పబ్లిసిటీ కోసం పుట్టించిన వార్తలాగే ఉంది మరి. మరి ఈ వార్త ఎలా పుట్టిందని తవ్వకాలు మొదలుపెడితే.. తేలిపోతుంది వ్యవహారం.