Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో బన్నీ కూతురి రచ్చ

By:  Tupaki Desk   |   12 Nov 2017 11:10 AM GMT
సోషల్ మీడియాలో బన్నీ కూతురి రచ్చ
X
సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. అందుకే బన్నీ సన్నిహితులు.. అభిమానులు ‘కింగ్ ఆఫ్ సోషల్ మీడియా’ అంటూ అతడికి బిరుదు కూడా ఇచ్చేశారు. సోషల్ మీడియా బలమేంటో తెలుసుకుని.. కొన్ని టీంలను ఏర్పాటు చేసి బన్నీ గురించి ఉద్ధృతంగా ప్రచారం చేస్తుంటుంది అతడి పీఆర్ టీం. తన సినిమాలకు సంబంధించే కాదు.. అతడి వ్యక్తిగత విశేషాల్ని కూడా అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అప్పుడప్పుడూ తన ఫ్యామిలీతో కలిసి చేసే ఫొటో షూట్లను బన్నీ పంచుకుంటూ ఉంటాడిక్కడ.

బన్నీ కొడుకు అల్లు అయాన్ ఇప్పటికే సోషల్ మీడియాలో సూపర్ పాపులర్. ఇప్పుడు అయాన్ చెల్లి అల్లు అర్హ కూడా అన్న తరహాలోనే పాపులారిటీ సంపాదిస్తోంది. ఇప్పటికే ఈ చిన్నదాని ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా స్నేహ అర్హను మోకాలిపై నిలబెట్టి తీయించుకున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చింది. ఇందులో సూపర్ క్యూట్ గా ఉన్న అర్హను చూసి బన్నీ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అభిమానులే కాక.. మిగతా నెటిజన్లు కూడా ఈ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు. నిన్న ఈ ఫొటో షేర్ చేసిన గంటలోనే ఈ ఫొటోకు 45 వేల రియాక్షన్స్ రావడం విశేషం. అల్లు ఫ్యామిలీ పోలికలతో చాలా ముద్దుగా ఉన్న అర్హకు ఇప్పటికే ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది.