Begin typing your search above and press return to search.

డబ్బింగ్ సినిమాలతో లాభాలు వెనకేసుకున్న కింగ్ నాగ్ - అల్లు అరవింద్..!

By:  Tupaki Desk   |   29 Oct 2022 4:30 PM GMT
డబ్బింగ్ సినిమాలతో లాభాలు వెనకేసుకున్న కింగ్ నాగ్ - అల్లు అరవింద్..!
X
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు రెండు డబ్బింగ్ సినిమాలు సందడి చేస్తున్నాయి. దసరా తర్వాత థియేటర్లలోకి వచ్చిన కన్నడ డబ్బింగ్ చిత్రం 'కాంతారా' మరియు దీపావళి సందర్భంగా విడుదలైన తమిళ డబ్బింగ్ సినిమా 'సర్దార్' తెలుగులో మంచి వసూళ్ళు రాబడుతూ దూసుకుపోతున్నాయి.

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో 'కేజీఎఫ్' నిర్మాతలు రూపొందించిన చిత్రం "కాంతారా". శాండిల్ వుడ్ లో సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అగ్ర నిర్మాత అల్లు అరవింద్ రిలీజ్ చేశారు.

మరోవైపు కార్తీ హీరోగా 'అభిమన్యుడు' దర్శకుడు తెరెక్కించిన స్పై యాక్షన్ మూవీ "సర్దార్". కార్తీ తో ఉన్న సాన్నిహిత్యంతో కింగ్ అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని తెలుగులో తన అన్నపూర్ణ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి తీసుకొచ్చారు.

'కాంతారా' మరియు 'సర్దార్' సినిమాలు రెండూ తెలుగులో బాక్సాఫీస్ విన్నర్స్ గా నిలిచారు. దసరా - దీపావళి పండుగలకు విడుదలైన స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు వసూళ్ల వేటలో వెనుకబడిపోయిన చోట.. రెండు డబ్బింగ్ చిత్రాలు డీసెంట్ కలెక్షన్స్ అందుకొని అందరినీ ఆశ్చర్య పరిచాయి.

'కాంతారా' సినిమా తెలుగులో 13 రోజుల్లోనే 45 కోట్ల గ్రాస్ వసూళ్ళు సాధించి.. 50 కోట్ల దిశగా దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో 'కాంతారా' తో పోల్చినప్పుడు 'సర్దార్‌' సినిమాకు తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. అయినప్పటికీ ఆ చిత్రం కూడా హిట్ లిస్టులో చేరిపోయింది.

ఈ వారంలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడంతో 'సర్దార్' & 'కాంతారా' చిత్రాలకు మరికొన్ని కలెక్షన్స్ యాడ్ అయ్యే అవకాశం కలిగింది. ఈ నేపథ్యంలో 'కాంతారా' టీమ్ మూడో వారంలోనూ ప్రమోషన్స్ చేయడానికి రెడీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

రెండు డబ్బింగ్ సినిమాల వల్ల మంచి లాభాలు వచ్చాయి కానీ.. అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశాన్ని నాగార్జున - అరవింద్ సద్వినియోగం చేసుకోలేకపోయారనే టాక్ నడుస్తోంది. మొదట్లో 'సర్దార్' 'కాంతారా' తెలుగు హక్కులను అన్నపూర్ణ - గీతా ఫిల్మ్ లకు అవుట్ రైట్ ప్రాతిపదికన కొనుగోలు చేసే అవకాశం వచ్చిందట.

అయితే అనుకోకుండా ఆఖరి నిమిషంలో ఇద్దరూ వెనక్కి తగ్గి పర్సంటేజీ బేసిస్ మీద ఈ సినిమాలను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. రెండు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు విజ‌యాన్ని ముందే ప‌సిగ‌ట్టినప్పటికీ.. పర్సంటేజీ ప్రాతిపదికన విడుదల చేయడం వల్ల ప్రాఫిట్ ను షేర్ చేసుకోవాల్సి వచ్చిందని అంటున్నారు.

ఏదైతేనేం నాగ్ మరియు అల్లు అరవింద్ ఇద్దరూ డబ్బింగ్ చిత్రాలతో గ‌ణ‌ణీయ‌మైన లాభాల్ని వెనకేసుకున్నారు. నిర్మాతలుగా మరోసారి సక్సెస్ అయ్యారని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.