Begin typing your search above and press return to search.
మెగా నిర్మాతకి అనుపమ ఎందుకంత స్పెషల్?
By: Tupaki Desk | 12 Dec 2022 4:30 PM GMTఅల్లు అరవింద్ కు ముగ్గురు కొడుకులు. ఇద్దరు కొడుకులు హీరోలు అయ్యారు. మరో కొడుకు వ్యాపారాలు చేస్తూ ఈ మధ్యే నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నారు. అల్లు అరవింద్ తండ్రిగా గర్వించే స్థాయిలోనే ముగ్గురు కొడుకులు కూడా ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. జీవితంలో ఎలాంటి లోటు లేని అల్లు అరవింద్ తనకు కూతురు ఉంటే.. అంటూ పలు సందర్భాల్లో మాట్లాడిన విషయం తెల్సిందే.
తాజాగా మరోసారి 18 పేజెస్ సినిమా యొక్క పాట విడుదల సందర్భంగా అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. 18 పేజెస్ లో నిఖిల్ కు జోడీగా మలయాళి ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. పాట విడుదల కార్యక్రమంలో అనుపమ పై అల్లు అరవింద్ ప్రశంసలు కురిపించాడు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ తనకు కూతురు లేదు కానీ.. అప్పుడప్పుడు అనుపమ పరమేశ్వరన్ లాంటి కూతురు ఉండాలి అనిపిస్తుంది. ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే తన లాంటి కూతురు ఉంటే బాగుంటుంది అనిపిస్తుందని అల్లు అరవింద్ పేర్కొన్నారు.
అనుపమ మనసులో ఏది దాచుకోదు. ప్రతి విషయాన్ని కూడా మొహం మీద చూపిస్తుంది. ఆమె మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడే రకం కానే కాదు. మనసులో ఏది ఉంటే అదే మొహం పై కనిపించేలా అనుపమ ఉంటుంది. అందుకే ఆమె తీరు నాకు నచ్చుతుంది. అనుపమ అన్ని విషయాల్లో కూడా చాలా ట్రాన్స్ పరెంట్ గా ఉంటుంది అంటూ అల్లు అరవింద్ పేర్కొన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.