Begin typing your search above and press return to search.

ఇండ‌స్ట్రీ బాస్ గా అర‌వింద్ ట్రాక్ రికార్డ్ వేరు

By:  Tupaki Desk   |   10 Jan 2022 11:30 AM GMT
ఇండ‌స్ట్రీ బాస్ గా అర‌వింద్ ట్రాక్ రికార్డ్ వేరు
X
మెగా నిర్మాత అల్లు అర‌వింద్ కెరీర్ ట్రాక్ రికార్డు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల‌లో ఆయ‌న‌ది ప్ర‌త్యేక‌మై స్థానం. దివంగ‌త న‌టుడు అల్లు రామ‌లింగ‌య్య వార‌సుడిగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన అర‌వింద్ తొలుత న‌టుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆ త‌ర్వాత గీతా ఆర్స్ట్ నిర్మాణ సంస్థ‌ను స్థాపించి ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించారు. ముందుగా ఆయ‌న ఓ సినిమాకు స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. దాస‌రి నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `భంట్రోతు భార్య` చిత్రానికి అర‌వింద్ స‌హ నిర్మాత‌గా ప‌నిచేసారు. నేడు ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌త్యేక క‌థ‌నం..

అర‌వింద్ అందించిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. నాటి..మేటి అగ్ర హీరోలంద‌రితోనూ అర‌వింద్ సినిమాలు నిర్మించారు. యువ న‌టుల్ని సైతం ప్రోత్స‌హించ‌డంలో అర‌వింద్ ముందుటారు. మెగాస్టార్ అనే వృక్షం నిర్మాణంలోనూ అత‌డు ఉన్నాడు. ఎంద‌రో న‌టీన‌టులు ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలిచ్చి నిల‌బెట్టారు. గీతా ఆర్స్ట్ కి అనుబంధంగా జీఏ-2 పిక్చ‌ర్స్ ని స్థాపించి అందులో యువ హీరోల‌తో సినిమాలు నిర్మిస్తున్నారు. యువ ప్ర‌తిభ‌న ప్రోత్స‌హించాల‌నే సంక‌ల్పంతోనే ఆ సంస్థ‌ను స్థాపించారు. ఇక స్క్రిప్ట్ జ‌డ్జ్ మెంట్ లో అర‌వింద్ నిర్ణ‌యాలు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న జ‌డ్జ్ మెంట్ కి తిరిగులేదు. క్రియేట‌ర్ విష‌యంలో వేలు పెట్ట‌రు. కానీ కంటెంట్ ని ఫైన‌ల్ చేయ‌డంలో మాత్రం దిట్ట‌.

నిర్మాత‌గా త‌న సుదీర్ఘ అనుభ‌వంతో ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. ఆ అనుభవంతోనే ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్ అవుతూ..ఆహా అనే ఓటీటీ బిజినెస్ లోకి అడుగు పెట్టారు. ప్ర‌తిభ గ‌ల ఔత్సాహికుల‌తో వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ...క‌ళ‌ల ప‌ట్ల‌ త‌మ‌కున్న అభిరుచుని చాటుకునే ఓ వేదిక‌ను క‌ల్పించారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఎంతో మంది కొత్త వారిని ఓటీటీ కి ప‌రిచ‌యం చేసారు. అలాగే ఆహా 2.0 ని కూడా లాంచ్ చేసి ఏ ఓటీటీ కార్పోరేట్ సంస్థ డిజైన్ చేయ‌ని ఎంట‌ర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్ లు ప్లాన్ చేస్తున్నారు. న‌ట‌సింహ బాల‌కృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాప‌బుల్ ఎంత స‌క్సెస్ అయిందో తెలిసిందే. సెల‌బ్రిటీల ఇంట‌ర్వ్యూలు చేస్తోన్న ఏకైక ఓటీటీ సంస్థ ఆహా కావ‌డం విశేషం.

ఇక అర‌వింద్ సినిమాల విష‌యానికి వ‌స్తే పాన్ ఇండియా లెవ‌ల్లో `రామాయ‌ణం` భారీ బ‌డ్జెట్ తో నిర్మించ‌డానికి రెడీ అవుతున్నారు. 500 కోట్ల బ‌డ్జెట్ తో మ‌రో ఇద్ద‌రు నిర్మాత‌ల స‌హ‌కారంతో ఈ సాహ‌సానికి పూనుకున్నారు. `బాహుబ‌లి`..`ఆదిపురుష్` లాంటి చిత్రాల‌కి ధీటుగా రామాయ‌ణాన్ని నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం గ‌ని చిత్రానికి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అలాగే `18 పేజీస్`..`ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్` చిత్రాల్ని నిర్మిస్తున్నారు.