Begin typing your search above and press return to search.
బన్నీ కోసం రంగంలోకి అల్లు అరవింద్
By: Tupaki Desk | 12 March 2022 3:30 PM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రంగంలోకి దిగుతున్నారా? అంటే టాలీవుడ్ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. అల్లు అర్జున్ నటించిన `పుష్ప ది రైజ్` మూవీ దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్, బన్నీ, మేకర్స్ కూడా ఊహించని విధంగా ఈ మూవీ ఉత్తరాదిలో వసూళ్ల వర్షం కురిపించింది. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో ఈ మూవీ సింహ గర్జన చేసిందని చెప్పొచ్చు. అంతగా ఈ మూవీ అక్కడ వసూళ్లని రాబట్టింది.
ఏకంగా అక్కడ 100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టడం బాలీవుడ్ వర్గాలని షాక్ కు గురిచేసింది. ఎలాంటి ప్రమోషన్స్ చేయని చిత్రానికి ఈ రేంజ్ వసూళ్లేంటీ సామీ అని అంతా అవాక్కయ్యారు. దీని పై బాలీవుడ్ లో ఇప్పటికీ పెద్ద చచ్చే జరుగుతోంది. హిందీ చిత్రాల రిలీజ్ ల సమయంలో అక్కడి మీడియా బాలీవుడ్ స్టార్స్ ని, మేకర్స్ ని పదే పదే `పుష్ప` సాధించిన కలెక్షన్ ల గురించి ప్రశ్నిస్తూ ఇరిటేట్ చేస్తున్నారు. ఇదిలా వుంటే తాజా పరిస్థితుల్ని, పుష్ప ది రైజ్‌కి దక్కిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని మేకర్స్ `పుష్ప ది రూల్` విషయంలో బాలీవుడ్ పై ప్రత్యేక దృష్టిని పెట్టారట.
ఇందు కోసం ఏకంగా మెగా ప్రొడ్యూసర్, మాస్టర్ మైండ్ అల్లు అరవింద్ ని రంగంలోకి దించేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పార్ట్ 1 పాటలు, మేనరిజమ్స్, హుక్ స్టెప్ , పుష్ప సిగ్నేచర్ స్టెప్ .. శ్రీవల్లి సాంగ్, సమంత ఐటమ్ సాంగ్ .. ఇలా పుష్ప చిత్రానికి సంబంధించిన ప్రతీ అంశం వైరల్ కావడంతో ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టూ సినిమా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద అన్ బిలీవబుల్ రికార్డ్స్‌ని సాధించిన సంచలనం సృష్టించింది.
దంఈఓత సెకండ్ పార్ట్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ అంచనాలని దృష్టిలోపెట్టుకుని అందుకు అనుగుణంగా పార్ట్ 2లో డైరెక్టర్ సుకుమార్ మార్పులు చేస్తున్నారని, బాలీవుడ్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని కొత్త పాత్రలని కూడా జోడించి బాలీవుడ్ నటులని, ఓ క్రేజీ హీరోయిన్ ని తీసుకోబోతున్నారని వార్తుల వినిపిస్తున్నాయి.
ఇక ఈ మూవీ బాలీవుడ్ మార్కెట్ బాధ్యతల్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి అప్పగిస్తున్నారట. బడ్జెట్ ప్లాన్ లతో పాటు బాలీవుడ్ లో ఈ మూవీని ఎవరి ద్వారా రిలీజ్ చేయాలి వంటి విషయాల్ని ఆయనే చూసుకుంటున్నారట.
సుకుమార్, మైత్రీ వారు కూడా ఈ విషయంలో అల్లు అరవింద్ కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఈ సారి బాలీవుడ్ లో `పుష్ప`ని రిలీజ్ చేసే సంస్థ మారే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి.
అల్లు అరవింద్ ఇన్వాల్వ్ కావడంతో గతంలో హిందీ వెర్షన్ ని విడుదల చేసిన గోల్డ్ మైన్స్ కంపనీ వారికి కాకుండా మరో క్రేజీ సంస్థకు ఈ మూవీ రిలీజ్ బాధ్యతల్ని అప్పగించే అవకాశం వుందని చెబుతున్నారు. `పుష్ప ది రూల్` ఏప్రిల్ లో పట్టాలెక్కబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో సుకుమార్, బన్నీ, మేకర్స్ బిజీగా వున్నారు.