Begin typing your search above and press return to search.
అరవింద్ మాట్లాడింది ఏ దర్శకుడి గురించి?
By: Tupaki Desk | 4 July 2018 7:55 AM GMTకొన్నిసార్లు సినీ ప్రముఖులు యధాలాపంగా మాట్లాడుతూనే కొన్ని సీక్రెట్లు బయటపెట్టేస్తారు. ‘తేజ్ ఐ లవ్యూ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో అరవింద్ కూడా అలాగే ఒక ఆసక్తికర విషయం బయటపెట్టారు. చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. ఫ్లాపవుతాయని తెలిసి కూడా కొన్ని సినిమాలు చేసినట్లు ఆయన చెప్పారు. ఆ సినిమాల ఫలితాల గురించి కూడా ముందే తేజు తనతో చెప్పాడని వెల్లడించారు.
కెరీర్ ఆరంభంలో ‘పిల్లా నువ్వు లేని జీవితం’.. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’.. ‘సుప్రీమ్’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్లతో ఊపుమీద కనిపించిన తేజు.. ఆ తర్వాత గాడి తప్పాడు. తిక్క.. విన్నర్.. నక్షత్రం.. జవాన్.. ఇంటిలిజెంట్.. ఇలా వరుసగా ఐదు డిజాస్టర్లు ఎదుర్కొన్నాడు. ఐతే తేజు సినిమాలు అటు ఇటు అవుతుండటంతో అతడికేమైంది అని వెళ్లి అడిగానని.. అప్పుడతను తాను ఇచ్చిన మాట కోసం సినిమాలు చేయాల్సి వస్తోందని.. ఆ సినిమాలు పోతాయని తెలిసినా.. మాట తప్పడం ఇష్టం లేక అవి చేయాల్సి వస్తోందని చెప్పాడని అరవింద్ తెలిపాడు.
ఒక దర్శకుడు ఒక ఫ్లాప్ సినిమా తీస్తే.. అంతకుముందు ఇచ్చిన మాట తీసి పక్కన పెట్టేస్తారని.. కానీ తేజు మాత్రం అలా చేయకుండా కొందరు దర్శకులతో సినిమాలు పూర్తి చేశాడని అన్నాడు. మరి అరవింద్ ఇక్కడ ప్రస్తావించింది ఏ దర్శకుల గురించి.. ఏ సినిమాల గురించి అన్న ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ సంగతలా వదిలేస్తే తేజు మంచి ఆర్టిస్టే కాదు.. మంచి వ్యక్తి కూడా అని.. అతను కొన్ని దశాబ్దాల పాటు పరిశ్రమలో ఉంటాడని చెబుతూ ‘మార్క్ మై వర్డ్స్’ అని అరవింద్ స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం.